సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా? అయితే ఇది ట్రై చేయండి!

praveen
ఈమధ్య కాలంలో చూసుకుంటే మన ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగిందని చెప్పుకోవాలి. ఆయిల్ ధర అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో జనాలు దానికి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే సింపుల్ గా వున్న EVలు మార్కెట్లో ఎక్కువగా అమ్ముడు పోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇంకా కొంతమంది మరీ సింపుల్‌గా అంటే సైకిల్ లాగా వుండే ఎలక్ట్రిక్ బైక్ కొనాలని చూస్తున్నారు. అలాంటి వారి కోసం రైడ్1అప్ కంపెనీ.. సైకిల్ లాంటి బైక్ ఒకదానిని మార్కెట్లోకి లాంచ్ చేసింది.
రైడ్1అప్ కంపెనీ.. రోడ్‌స్టర్ V2 గ్రావెల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది చూడటానికి అచ్చం సైకిల్ మాదిరి ఉంటుంది. సింపుల్‌గా, ఫాస్ట్‌గా వెళ్ళేలాగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తయారుచేసిన్లు కంపెనీ పేర్కొంది. మిగతా బైక్‌లతో పోల్చితే దీని బరువు కేవలం 15 కేజీలు మాత్రమే. అందువల్ల దీన్ని అవసరమైతే మోసుకొని కూడా బయటకి ఎక్కడికన్నా తీసుకుపోవచ్చు. దీన్ని రోడ్డుపై నడుపుతున్నప్పుడు దీనిని బైక్ అని ఎవరూ అనుకోరు. పెడల్స్ తొక్కకుండానే ఇది వెళ్లిపోవడం చూసి ఇతరులు మాత్రం ఆశ్చర్యానికి లోనవుతారు.
సిటీల్లో డ్రైవింగ్ చేసే వారికి అనుకూలంగా ఈ బైక్‌ ఉంటుంది. ఇది 4 కలర్స్‌లో మార్కెట్లో మీకు లభిస్తోంది. అవి బర్గుండీ మాట్టే, గ్రావెల్ గ్రే, బ్లాక్ మాట్టే, సిల్వర్ మాట్టే. అది 36 వోల్ట్‌ల పవర్‌తో ఉంది. అందువల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే.. 32 కిలోమీటర్ల వరకూ వెళ్లి రావచ్చు. ఈ బ్యాటరీని బైక్ నుంచి విడదీసే ఛాన్స్ లేదు. ఈ బైక్‌కి 5 రకాల వేగ పరిమితులు ఉన్నాయి. తద్వారా ఎత్తైన ప్రదేశాల్లో కూడా బైక్ పైకి ఈజీగా వెళ్లేందుకు వీలుగా ఉంది. ఈ బైక్ వెళ్లేటప్పుడు స్పీడ్ ఎంతో తెలుసుకునేందుకు హ్యాండిల్‌ బార్‌పై కాంపాక్ట్ LCD డిస్‌ప్లే కూడా ఉంది. రోడ్‌స్టర్ V2 గ్రావెల్‌ ధరను $1,095 అంటే మన ఇండియన్ కరెన్సీలో ₹90803గా ఉందని కంపెనీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: