పెళ్లొద్దు.. పిల్లలు కావాలంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!

Divya
టాలీవుడ్ , కోలీవుడ్ లో వరుస సినిమాలలో స్టార్ హీరోలతో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ అమ్మడు నటించిన సినిమాలు మాత్రం ఈ మధ్యకాలంలో హిట్ కాలేదు కానీ, అవకాశాలు మాత్రం వెలుబడుతూనే ఉన్నాయి. గత ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటించింది. అలాగే ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాలో నటించిన ఈ చిత్రాలు రెండు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తనకు పిల్లల పట్ల ఉన్న అమితమైన ప్రేమ గురించి తెలియజేస్తూ తనకు చిన్న వయసు నుంచే పిల్లలు అంటే చాలా ఇష్టమని , తాను పుట్టిన ఏడేళ్ల తర్వాత తనకు ఒక చెల్లెలు పుట్టిందని, తనకి చెల్లిలే పుట్టాలని ప్రతిరోజు ఆ దేవుడికి ఉత్తరాలు కూడా రాసేదాన్ని అంటూ తెలిపింది. అందుకే తన చెల్లెలని సోదరిలా కాకుండా కూతురిలా చూసుకుంటానంటూ తెలియజేసింది.



తన లైఫ్ లో వివాహానికి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి తాను ఒక నలుగురు పిల్లలను దత్తకు తీసుకోవాలని కోరిక ఉన్నప్పటికీ పిల్లల గురించి తాను నిరంతరం ఆలోచిస్తూ, వారిని పెంచడం అంటే ఒక కొత్త ప్రపంచంలోకి  వెళ్లడంలా అనిపిస్తుంది. అయితే తాను ఉన్న బిజీ షెడ్యూల్స్, వృత్తిపరమైన బాధ్యతల వల్ల అవి సాధ్యం కాలేకపోతున్నాయని కానీ భవిష్యత్తులో మాత్రం తాను కచ్చితంగా నలుగురు పిల్లలను దత్తకు తీసుకుంటాను అంటూ క్లారిటీగా చెప్పేసింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పిల్లలను దత్తకు తీసుకోవాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.ఈ విషయం పైన అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చాలామందికి సెలబ్రిటీలు కూడా పిల్లలను దత్తత తీసుకొని మరి పెంచుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: