యూ ట్యూబ్: మరో కొత్త ఫీచర్?

యూ ట్యూబ్ తన వినియోగదారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరి కొత్త ఫీచర్లని లాంచ్ చేస్తుంది. ఇదే క్రమంలో యూ ట్యూబ్ మ్యూజిక్ లవర్స్ కోసం ఓ ప్రత్యేకమైన అప్ డేట్ ని కూడా యూ ట్యూబ్ పరిచయం చేసింది. రేడియో బిల్డర్ పేరిట దీనిని లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఇంకా అలాగే ఐఓఎస్ రెండింటిపై కూడా పనిచేస్తుంది.ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..ఇక గూగుల్ డెవలప్ చేసిన ఈ యూ ట్యూబ్ లో యూ ట్యూబ్ మ్యూజిక్ అనే ఆప్షన్ కూడా ఉంది. దీనిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు యూ ట్యూబ్ మ్యూజిక్  రేడియో బిల్డర్ అనే సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే వినియోగదారులు తమకు ఇష్టమైన జోనర్ లో పాటలను అన్ని ఒక దగ్గర చేర్చుకొని స్టేషన్ తయారు చేసుకోవచ్చు. దీనిని గత మంగళవారం నాడు యూ ట్యూబ్ లాంచ్ చేసింది. యూ ట్యూబ్ లోని యూ ట్యూబ్ హోమ్ పేజీపై యువర్ మ్యూజిక్ టెనర్ సెక్షన్ లో ఈ సరికొత్త రేడియో బిల్డర్ ఫీచర్ మీకు కనిపిస్తుంది.


ఇక ఈ రేడియో బిల్డర్ ఫీచర్ తో మీరు 30 దాకా ఆర్టిస్ట్ లను ఎంపిక చేసుకొని వారి పాటలు అందులో ప్లే అయ్యేటట్లు ఈజీగా చేసుకోవచ్చు.అలాగే ఎన్ని సార్లు అవి ప్లే అవ్వాలో కూడా మీరు నిర్ణయించవచ్చు.ఇంకా మీరు ఎంపిక చేసుకున్న ఆర్టిస్ట్ నుంచి మాత్రమే వినాలనుకున్నా లేదా ఇతర ఆర్టిస్ట్ ల సాంగ్స్ వినాలన్నా ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి.ఈ రేడియో బిల్డర్ అప్ డేట్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లే లిస్ట్ కి ఫిల్టర్లని అప్లై చేసుకోవచ్చు. దీనిలో చిల్, డౌన్ బీట్ ఇంకా అలాగే పంప్ అప్ వంటి కేటగిరీల్లో సాంగ్స్ ని ఫిల్టర్ చేసుకొని ప్లే లిస్ట్ ని సెట్ చేసుకోవచ్చు.ఇంకా అలాగే మీరు రేడియో స్టేషన్ క్రియేట్ చేయాలంటే యూ ట్యూబ్ మ్యూజిక్ లోకి వెళ్లి ఫస్ట్ దీనిని యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రియేట్ రేడియో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఆర్టిస్ట్ లను సెలెక్ట్ చేసుకోవాలి.ఇంకా అలాగే ఈ ఫీచర్ ని ఎక్కడి నుంచైనా, ఎవరైనా చాలా ఈజీగా వినియోగించుకోవచ్చని గూగుల్ కంపెనీ ప్రకటించింది. యూ ట్యూబ్ పెయిడ్ సబ్ స్క్రైబర్స్ ఇంకా అలాగే ఫ్రీ యూజర్లు కూడా ఈ ఫీచర్ ని వినియోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: