80 వేలలోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే?

ఇక ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. మంచి ఫీచర్లు, కాస్త బెటర్ రేంజ్ కావాలంటే ఖచ్చితంగా మనం ధర ఎక్కువ పెట్టాల్సిందే.అయితే తక్కువ బడ్జెట్ లో ఉన్న మంచి ఫీచర్లతో కూడిని బైక్లు ఇంకా స్కూటర్లు కూడా ఉన్నాయి.వాటిలో ఇదొకటి.హయాసా ఇరా అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ మార్కెట్‌లో ప్రారంభ ధర రూ. 76,750 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) తో విడుదల అయ్యింది.దీని రేంజ్, అలాగే స్పీడ్ ని పరిశీలిస్తే దీనిలోని బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల రేంజ్ అందుబాటులో ఉంటుందని, ఈ రేంజ్‌తో గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగం లభిస్తుందని కంపెనీ తెలిపింది.


ఇంకా అలాగే బ్రేకింగ్ , సస్పెన్షన్ సిస్టమ్ లను పరిశీలస్తే స్కూటర్ ముందు, వెనుక చక్రాలలో డిస్క్ బ్రేక్‌లను ఈ బైక్ అందించింది. అలాగే దానితో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అందించింది. ఈ బైక్ సస్పెన్షన్ సిస్టమ్ విషయానికి వస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్ సస్పెన్షన్ అలాగే వెనుక వైపున స్ప్రింగ్ బేస్డ్ షాక్ అబ్జార్బర్ సిస్టమ్ ని అందిస్తోంది.ఇంకా ఈ హైయాసా ఇరా ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ స్పీడోమీటర్, పుష్ బటన్ స్టార్ట్, ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్, అల్లాయ్ వీల్ ఇంకా అలాగే ట్యూబ్‌లెస్ టైర్ ఉన్నాయి.కాబట్టి 80 వేల లోపు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా దీన్ని ట్రై చెయ్యొచ్చు. కానీ ఇది రేంజ్ తక్కువ ఇస్తుంది. దూర ప్రయాణికులకు ఇది పనికిరాదు. లోకల్ లో తిరిగేవారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: