బుల్లి పిట్ట: రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్..!

Divya
రోజు రోజుకి టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది పెరిగిపోతూనే ఉంది.  మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కూడా పెరుగుతూనే ఉన్నది. అంతేకాకుండా డీజిల్ , పెట్రోల్ కార్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. వాహన వినియోగదారులు కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్ వాహనాల పైన మక్కువ చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల సంఖ్య రోజుకి రోజుకి పెరుగుతూనే ఉన్నది.  దీంతో ఆయా కంపెనీలు కూడా నిత్యం పలు రకాలుగా ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉన్నారు.
ఇప్పటికే మార్కెట్లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా విడుదల అవుతూనే ఉన్నాయి.  ఇదంతా ఇలా ఉంటే తాజాగా మార్కెట్లోకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అతి తక్కువ ధరకే రూ.25,000 కే అందుబాటులోకి వచ్చింది మరి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే ఎవాన్  ఈ ప్లస్ స్కూటర్ ప్రస్తుతం అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర కేవలం 25000 మాత్రమే తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచించేవారికి ఈ మోడల్ స్కూటర్ని అందుబాటులోకి ఉంచింది. ఇకపోతే ఒకసారి చార్జి చేశామంటే చాలు 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందిm అంతేకాదు దీని టాప్ స్పీడ్ గంటకు 24 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.
అంతేకాదు దీంతోపాటు డెటెల్ ఈజీ ప్లస్ అనే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.40,000 నుంచి ప్రారంభం అవుతుంది. చీపెస్ట్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఇది రెండవ స్థానంలో నిలవడం గమనాభం దీని రేంజ్ 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇకపోతే గంటకు 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ వెళ్తుంది. అలాగే మరో ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని విలువ రూ.44500 నుంచి మొదలవుతుంది. అలాగే ఒక్కసారి చార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు మీరు ప్రయాణించవచ్చు .అలాగే గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: