బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది ?

ఇండియాలో అతిపెద్ద టూ వీలర్ వాహన తయారీదారులలో ఒకటైన బజాజ్.. దాని అత్యంత ప్రసిద్ది చెందిన స్కూటర్ బజాజ్ చేతక్‌ను ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో విడుదల చేసింది. హమారా బజాజ్’గా ప్రసిద్ధి చెందిన ఈ స్కూటర్ ఇప్పుడు ఎలక్ట్రిక్‌ స్కూటర్ గా మారి సందడి చేస్తుంది. ఈ స్కూటర్ మంచి ఫీచర్లతో పాటు కొత్త లుక్స్‌ని కూడా కలిగి ఉంది.ఇక దీని లుక్ గురించి చెప్పాలంటే ఇది చాలా స్టైలిష్‌గా ఉంది.దీని ఫ్రంట్ లైట్ కూడా గుండ్రంగా ఉంది. దీని బాడీ మొత్తం కూడా మెటల్ తో తయారు చేశారు.డిస్‌ప్లేలో బ్యాటరీ శాతంతో పాటు, GPS, బ్లూటూత్ ఛార్జింగ్, జియో మ్యాప్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇంకా అలాగే LED ల్యాంప్స్ మొదలైనవి ఉన్నాయి. ఇది 4080W BLDC ఎలక్ట్రిక్ మోటారుతో పాటు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా పవర్ ని పొందుతుంది. ఈ బ్యాటరీపై కంపెనీ మొత్తం 3 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తుంది.


ఇక ఈ బజాజ్ చేతక్‌లో రెండు మోడ్‌లు ఉన్నాయి. దాని ప్రకారం స్కూటర్ మైలేజీ నిర్ణయించబడుతుంది. దీని మొదటి మోడ్ ఎకో, దీనిలో స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 95 కిలోమీటర్లు నడుస్తుంది. ఇంకా మరోవైపు, స్పోర్ట్స్ మోడ్ ఉంది, దీనిలో స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్లు ఇది నడుస్తుంది.ఈ స్కూటర్ ధరని రూ. 1.51 లక్షలుగా నిర్ణయించారు.. ఇక ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర అలాగే ఆన్ రోడ్ తర్వాత మొత్తం రూ. 1,57,943 అవుతుంది.ఇప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ లు Ather, Ola, TVS ఇక్యూబ్ ఇంకా hero Vida వంటి పోటీకి అనుగుణంగా, బజాజ్ చేతక్ 2423 ప్రీమియంను విడుదల చేస్తున్నారు. యంగ్ రైడర్లను ఆకర్షించడంపై బజాజ్ చేతక్ చాలా ఎక్కువగా దృష్టి పెట్టింది.అలాగే కంపెనీ  త్వరలోనే  సేల్స్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బజాజ్ చేతక్ ను కొనుక్కోవాలంటే సమీపంలోని బజాజ్ డీలర్ ను సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: