పబ్లిక్ టాయిలెట్ డోర్స్.. ఎందుకు పూర్తిగా ఉండవో తెలుసా?

praveen
సాదరణంగా ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న టాయిలెట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు . ఇక బయటికి వెళ్ళినప్పుడు ఇక అక్కడక్కడ ఉండే పబ్లిక్ టాయిలెట్స్ ని వినియోగిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే పబ్లిక్ టాయిలెట్స్ ని అటు ఇంట్లో ఉండే పర్సనల్ టాయిలెట్స్ ని చూసినప్పుడు ఇక వాటి తలుపు విషయంలో ఒక తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉండే టాయిలెట్స్ కి సంబంధించిన డోర్ కింద నుండి మీదే వరకు పూర్తిగా కవర్ చేసే విధంగా ఉంటుంది.  కానీ పబ్లిక్ టాయిలెట్స్ లో మాత్రం డోర్ కింద భాగంలో కాస్త గ్యాప్ ఉంటుంది.

 ఆఫీసులో, స్కూలు కాలేజీలలో కూడా ఇక ఇలాంటి టాయిలెట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి డోర్స్ కారణంగా లోపల ఉన్న వారి కాళ్లు బయటినుంచి చూసే వారికి కనిపిస్తాయి.  కేవలం మనదేశంలోనే కాదు అటు పాశ్యత దేశాల్లో కూడా ఇదే రీతిలో పబ్లిక్ టాయిలెట్స్ డోర్స్ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇలా టాయిలెట్స్ డోర్స్ కింద భాగంలో కాస్త ఓపెన్ గా ఉంచడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 ఎమర్జెన్సీ కోసం : ఎవరైనా టాయిలెట్ కు వెళ్ళినప్పుడు స్పృహ తప్పి పడిపోతే లేదా ఇంకా ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు వెంటనే తెలుసుకోవడానికి వీలుంటుంది. అందుకే ఇక ఇలా డోర్ కింది భాగంలో ఓపెన్ గా ఉంచుతారట.
 పరిశుభ్రత : ఇలా టాయిలెట్ కింది భాగంలో డోర్ ఓపెన్ గా ఉండటం వల్ల ఇక క్లీనర్లకు టాయిలెట్ శుభ్రం చేయడం ఎంతో సులభంగా ఉంటుందట. పబ్లిక్ టాయిలెట్స్ అన్న తర్వాత ఎక్కువ మంది ఉపయోగిస్తారు. కాబట్టి ఒకరోజులో చాలాసార్లు శుభ్రం చేయాల్సి ఉంటుంది.

 భద్రత : టాయిలెట్స్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఇలా కింద వైపు డోర్ ని ఓపెన్ గా ఉంచుతారట. డ్రగ్స్ వాడకం శృంగారం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఇది ఉపకరిస్తుందట.

 రవాణా సులభం : దిగువ భాగంలో ఖాళీగా ఉండే డోర్లను తయారు చేయడం కానీ రవాణా చేయడం ఇదంతా ఎంతో సులభమైన ప్రక్రియ. అందుకోసమే ఇక ఇలాంటి డోర్స్ ని పబ్లిక్ టాయిలెట్స్ కి పెడతారట.
 దుర్వాసన  : పబ్లిక్ టాయిలెట్స్ ని ఎక్కువ మంది వినియోగిస్తారు. కాబట్టి ఇక కింద భాగంలో ఉన్న ఖాళీ కారణంగా ఇక దుర్వాసన బయటికి వెళ్లిపోతుంది. అందుకే టాయిలెట్ ఎప్పుడు తడిగా ఉండేందుకు అవకాశం ఉంటుందట. తద్వారా ఇక అనారోగ్యానికి కారణమైన వైరస్ లను కూడా నివారించవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: