రైల్వేస్టేషన్లో.. నేమ్ బోర్డులు పసుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో భారత రైల్వే శాఖ అటు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచుతుంది. ఈ నేపథ్యంలో ఇక ఎంతోమంది  రైల్వే ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. కొంతమంది అయితే రైల్వే ప్రయాణాలను ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఇక తరచూ రైలు ప్రయాణాలు చేసే వారు కూడా ఉంటారు. ఇకపోతే ఇలా రైల్వే స్టేషన్ కు తరచూ వెళ్లేవారు అక్కడ కనిపించి వస్తువులను రోజు చూస్తూనే ఉంటారు. కానీ చూసిన పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రమే అక్కడున్నవి అలాగే ఎందుకు ఉన్నాయి అని ఆలోచన చేస్తూ ఉంటారు.

 ఇలా మనం తరచూ చూసి కూడా పట్టించుకోకుండా ఉన్న వాటిలో అటు రైల్వేస్టేషన్లో ఉండే నేమ్ బోర్డులు కూడా ఒకటి అని చెప్పాలి. ఏ రైల్వే స్టేషన్ కు వెళ్లిన ఈ నేమ్ బోర్డులు పసుపు రంగులోనే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ నేమ్ బోర్డులు కేవలం పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి అనే అనుమానం కొంతమందికి వచ్చే ఉంటుంది. దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎరుపు రంగుకు తరంగధైర్గ్యం కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎరుపు రంగు వస్తువులు దూరంగా ఉన్నా కూడా మనం వాటిని తొందరగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.

 అందుకే హెచ్చరికలు తెలియజేయడానికి అటు ఎరుపు రంగును ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే రహదారుపై ఎక్కువగా ఎరుపు రంగు హెచ్చరికలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎరుపు రంగుతో పోల్చి చూస్తే పసుపు రంగు తరంగ ధైర్ఘ్యం కొంచెం తక్కువగా ఉంటుంది. పసుపు రంగుకి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుందట. అందుకే రైల్వేస్టేషన్లో నేమ్ బోర్డులు పసుపు రంగులో ఉండేలా చూసుకుంటారట.  వాటిపై ఇక నలుపు రంగుతో పేర్లు రాస్తారట. ఇక పసుపు రంగు ఎంతో కాంతివంతంగా కనిపించడం వల్ల రైలు ఏ స్టేషన్ నుంచి వెళ్తుంది అన్నది లోకో పైలట్ ఎంతో సులభంగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుందట. ఇక పసుపు రంగు పైన నలుపు రంగు అక్షరాలు రాస్తే అది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందట. అందుకనే పసుపు రంగుపై కేవలం నల్లటి రంగుతోనే అక్షరాలు రాస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: