ప్రస్తుతం వాట్సాప్‌కు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాటింగ్‌లు, స్టేటస్లు ఇంకా అలాగే గ్రూప్ మెసేజ్‌లతో మునిగి తేలుతున్నారు.ఇక మన దైనందిన కార్యకలాపాలకు కూడా అంతే ప్రాముఖ్యతనిస్తున్నారు. పిల్లల నుండి పెద్దల వరకు, ఈ మెసేజింగ్ యాప్ అనేది ఉపయోగించబడుతుంది. ఇండియాలోనే దాదాపు 550 మిలియన్ల మంది దీనిని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ట్రిక్స్ వంటి ఎన్నో థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి. అయితే వాట్సాప్‌లో మనం పెట్టిన డీపీని ఎవరు చూశారో లేదో కూడా మీరు తెలుసుకోవచ్చు.అది ఎలా, ఆ యాప్ ఏమిటి ఇంకా ఎలా డౌన్లోడ్ చేయాలి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక వాట్సాప్ డీపీని ఎవరెవరు చూశారనే విషయం తెలుసకోవాలంటే థర్డ్ పార్టీ యాప్ అనేది అవసరం. ఈ యాప్‌తో వాట్సాప్‌లో మీ డీపీని ఎవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిలో మీ డీపీ చూసిన వారు పేరు ఇంకా నంబర్‌ను కూడా పొందవచ్చు.అయితే దీని కోసం మీరు ముందుగా మీరు గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లాలి.
ఇక అందులో నుంచి WhatsApp- Who Viewed Me లేదా Whats Tracker అనే థర్డ్ పార్టీ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మీకు తెలియకుండానే మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూస్తున్నారనే సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఇక ఇన్స్టాల్ చేసిన తర్వాత రన్ చెయ్యడానికి కొంత సమయం మీకు పడుతుంది. ఈ యాప్ మీకు గత 24 గంటల్లో మీ ప్రొఫైల్ ఫోటో లేదా డీపీని చూసిన వారి జాబితాను అందిస్తుంది.అయితే మీకు ఇక్కడ ఇంకో హెచ్చరిక ఏంటంటే.. ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్స్టాల్ చేసే ముందు మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ యాప్‌లు మీ ఫోన్‌కి ఎంతవరకు సురక్షితమో అధికారిక సమాచారం అనేది లేదు. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను చాలా ఈజీగా స్వాధీనం చేసుకోగలదు. అందుకే ఈ థర్డ్ పార్టీ యాప్‌ని డౌన్లోడ్ చేసే ముందు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండి. కేవలం మీకు నమ్మకం కలిగిన యాప్ స్టోర్ల నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి.