బుల్లి పిట్ట: ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్స్..!!
బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ తన సింపుల్ వన్ స్కూటర్ను గతంలో ఆవిష్కరించిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా వాటిని బుకింగ్ చేసుకునేందుకు సదుపాయం ఇంకా ప్రారంభించలేదు తమిళనాడులోని గాలగిరి వద్ద రూ.100 కోట్ల పెట్టుబడితో సింపుల్ వన్ ఓ అతిపెద్ద ప్లాట్ ఫామ్ ను ఏర్పరచడం జరిగింది. దీంతో అక్కడ ప్రతియేట పది లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉండే విధంగా ప్లాన్ చేస్తోంది. ఈ సింపుల్ ఎనర్జీ కంపెనీ. ఇక 2023 జనవరి 19 నుంచి స్కూటర్లు తయారు మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేశారు.
ఆ తర్వాత మార్చి నుంచి స్కూటర్లు డెలివరీ చేస్తామని కాకపోతే గతంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.10 లక్షల వరకు ఎక్స్ షోరూం ధర ఉంటుందని తెలియజేసింది. కానీ సరఫరాల సమస్య నేపథ్యంలో ఈ ధర పెరగవచ్చని సంకేతాలను తెలియజేస్తోంది. రాష్ట్రాల సబ్సిడీ కాకుండా ఎక్స్ షోరూం ధర రూ.1.45 లక్షలు ఉంటుందని తెలియజేస్తోంది. అయితే ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 235 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తోందని కంపెనీ తెలియజేయడం జరిగింది. దీనిని సరికొత్త అప్డేట్ తో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చే సమయానికి మరింత అభివృద్ధి చేసి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే విధంగా మరింతగా వీటిని అభివృద్ధి చేయబోతున్నామని తెలియజేయడం జరుగుతోంది.