హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వాడేవారికి బ్యాడ్ న్యూస్?

ఈ కాలంలో హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వాడని వారు అసలు వుండరు. ఇప్పుడు 90 శాతం మంది లైఫ్‌లో ఇవి భాగమైపోయాయి. అవి 24 గంటలు పెట్టుకుని ఇప్పుడున్న ఇంటర్ నెట్ ప్రపంచంలో తమకు ఇష్టమైన మ్యూజిక్ వింటూ బాగా ఎంజాయ్ చేయడం యూత్‌కి బాగా అలవాటైపోయింది.బాగా సౌండ్ పెట్టుకుంటేనే కిక్ వస్తుందని యూత్ పీలింగ్. కానీ, వీటి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా 100కోట్లకు పైగా యుక్తవయసు పిల్లలు ఇంకా అలాగే యువతలో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందుకు సంబంధించి అధ్యయన నివేదిక బీఎంజే గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 43కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. 


ఈ నేపథ్యంలో సురక్షితంకాని హెడ్ ఫోన్స్ ఇంకా ఇయర్ బర్డ్స్ వినియోగంపై అమెరికాలోని మెడికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కరోలినా పరిశోధకుల బృందం అధ్యయనం చేపట్టింది. సాధారణంగా పెద్దవారిలో 80 డెసిబెల్స్‌, పిల్లల్లో 75 డీబీ శబ్దం అనేది మించకూడదు. కానీ, ప్రస్తుతం ఇయర్ ఫోన్స్ వినియోగించే వారు సరాసరి 105 డెసిబెల్‌ శబ్దాన్ని వింటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఇక ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో యువతలో వినికిడి సమస్య బాగా పెరిగే అవకాశముందని పరిశోధకులు హెచ్చరించారు. ముఖ్యంగా ఇటీవల పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో హెడ్‌ఫోన్లు ఇంకా అలాగే ఇయర్‌బడ్స్‌ వంటి వాటితో మ్యూజిక్ వినడంతోపాటు భారీ శబ్దాలుండే మ్యూజిక్‌ ఈవెంట్లకు హాజరు కావడం వల్ల యువత వినికిడి లోపం బారినపడే ముప్పు చాలా ఎక్కువగా ఉందన్నారు.కాబట్టి ఇయర్ ఫోన్స్ అస్సలు వినియోగించకండి. నాసి రకం ఇయర్ ఫోన్స్ అయితే అస్సలు వాడకండి. ఎందుకంటే అవి వాడటం వల్ల చెవులు ఇంకా దెబ్బ తింటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: