గూగుల్ నుంచి సూపర్ సెక్యూరిటీ ఫీచర్?

ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో వున్నాం.టెక్నాలజీ అనేది రోజు రోజుకి బాగా పెరిగిపోతోంది.రోజురోజుకు అనేక రకాల కొత్త కొత్త ఫీచర్స్‌ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి.ఎన్నో రకాల ఫీచర్స్ మనం చూస్తున్నాం.ఇక గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది అదిరిపోయే శుభవార్త. ఇక నుంచి మీ గూగుల్‌ అకౌంట్లకు పాస్‌వర్డ్‌ లేకుండానే లాగిన్‌ చేసుకునే సదుపాయం అనేది వచ్చేస్తోంది.యూజర్లకు ఇంకా ఎక్కువ సెక్యూరిటీ అందించేందుకు గూగుల్‌ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లు క్రోమ్‌ కోసం కొత్త పాస్‌కీ ఫీచర్‌ను విడుదల చేయడం జరిగింది. మీ పాస్‌వర్డ్‌ని ఉపయోగించకుండా ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్‌కి లాగిన్ చేసేందుకు పిన్‌లు లేదా బయోమెట్రిక్‌ను ఉపయోగించి మీరు లాగిన్‌ చేసుకోవచ్చు. యూజర్లు తమ ఐటెంటిటీ అథెంటికేషన్‌ కోసం ఈ ఆప్షన్‌ ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం డెవలపర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి వరకు సాధారణ వినియోగదారులకు పాస్‌కీల ఫీచర్‌ను అందించాలని ప్లాన్ చేస్తుంది.


గూగుల్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌కి బ్యాకప్‌ చేయబడుతుంది. సమస్యల గురించి చింతించకుండా ఆండ్రాయిడ్‌ పరికరాలలో పాస్‌కీలను సష్టించగలరని కంపెనీ చెబుతోంది.ఈ ఏడాది మే నెలలో మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు యూజర్లకు సాధారణ పాస్‌వర్డ్ లేని సైన్-ఇన్ ఆప్షన్ ప్రకటించాయి. దీనిని వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం, ఎఫ్‌ఐడీవో అలయన్స్ డెవలప్ చేసిన పాస్‌కీ అని పిలుస్తారు.అయితే గూగుల్‌ పాస్‌వర్డ్‌ లాగా కాకుండా పాస్‌కీ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్‌ అవుతుందని దీనిని మళ్లీ ఉపయోగించాల్సిన అవసరం ఉండదని చెబుతోంది గూగుల్‌. పాస్‌వర్డ్ అనేది ఆటోఫిల్‌ లాగా ఈ పాస్‌కీ పని చేస్తుందని, పాస్‌కీ గూగుల్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌కు బ్యాకప్‌ అవుతుంది కాబట్టి మళ్లీ చేయాల్సిన అవసరం రాదు. ఇది యూజర్‌ డివైజ్‌ నుంచి మాత్రమే వస్తుంది. ఫోన్‌ ను ఎవరైనా చోరీ చేసిన సమయంలో వారు సైన్‌ ఇన్‌ చేయకుండా ఉండేందుకు ఇది బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: