బుల్లి పిట్ట: అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో సరికొత్త మొబైల్..!!
OPPO A-77 మొబైల్ మార్కెట్లోకి 4జి ఫోన్ బడ్జెట్ ధరల ఈ మొబైల్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవల కాలంలో మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఒప్పో సంస్థ తాజాగా ఇలాంటి మొబైల్ ని ఇండియాలో తీసుకోవచ్చినట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.56 అంగుళాల హెచ్డి డిస్ప్లే తోపాటు ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్ 128 GB స్టోరేజ్ మెమొరీ తో కలదు.
ఈ మొబైల్ సూపర్ ఫాస్ట్ చార్జర్ తో కూడా పని చేసే సామర్థ్యం కలదు. ఈ మొబైల్ బ్యాటరీ 5000MAH సామర్థ్యం కలదు ఈ మొబైల్ కేవలం ఐదు నిమిషాలు చార్జింగ్ చేస్తే చాలు మూడు గంటల పాటు అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ఈ మొబైల్ ధర రూ.17,999 రూపాయలు పలు బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10త్ శాతం క్యాష్ బ్యాక్ ముందే అవకాశం ఉంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా.. సెల్ఫీ ప్రియుల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా కలదు.