ఫ్యూచర్ లో 3D ప్రింటింగ్‌కు డిమాండ్ అనేది బాగా పెరగనుంది.అందువల్ల ఈ మేరకు దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.ముఖ్యంగా హాస్పిటల్స్ లో మానవ అవయవాల ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం త్రీడీ ప్రింటింగ్ అవసరం కావచ్చు. ప్రస్తుతం ఇది సాధ్యం కానప్పటికీ, టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి, ఫ్యూచర్‌లో 3D ప్రింటింగ్‌కు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.వేగం, సామర్థ్యం, సరళత, డిజైన్ ఫ్రీడం, విశ్వసనీయత ఇంకా అలాగే కచ్చితత్వం వంటి అనేక ప్రయోజనాల కారణంగా ఈ టెక్నాలజీ వినియోగం భవిష్యత్తులో విపరీతంగా పెరగబోతోంది. 3D ప్రింటింగ్ అనేది వేగవంతమైన టర్న్-అరౌండ్ టైమ్‌ను అందిస్తూ, చిన్న వాల్యూమ్‌తో కస్టమైజ్డ్ ఉత్పత్తులను రూపొందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం అనేది అసలు దీని ద్వారా సాధ్యం కాదు.3డి ప్రింటింగ్ భారతదేశంలో తయారీ రంగాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. కచ్చితత్వంతో కూడిన వివరాల కోసం కొత్త సాంకేతికతలపై ఆసక్తి ఉన్న ఎవరైనా, వేగంగా విస్తరిస్తున్న 3D ప్రింటింగ్ ప్రపంచంపై ప్రత్యేక దృష్టిసారిస్తే చాలా విషయాలు తెలుసుకుంటారు.
ఈ టెక్నాలజీ అంచనా వృద్ధిని బట్టి, ఈ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇదే సరైన సమయమని టెక్ నిపుణులు భావిస్తున్నారు.ఇంజనీరింగ్ లేదా డిజైన్, యానిమేషన్, మెడికల్ టెక్నాలజీస్ లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో డిగ్రీ కాంబినేషన్‌తో తీడ్రీ పింటింగ్ ఉంటే చాలా మంచిది. ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేయడానికి, డిజైన్ చేయడం కోసం 3డీ CAD కోర్సు మంచిది.అలాగే మెకానికల్ ఆపరేషన్స్, 3D ప్రింటర్ల తయారీ అప్లికేషన్స్ గురించి పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి అవసరమయ్యే కోర్సు మంచిది.ఈ మూడు ఐడియల్ కాంబినేషన్స్ 3D ప్రింటింగ్ చుట్టూ కేంద్రీకృతమైన కొత్త రోల్స్‌కు స్ప్రింగ్‌బోర్డ్‌గా ఉపయోగపడతాయి. 3D ప్రింటింగ్‌లో వృత్తిని కొనసాగించాలనుకునే ఎవరైనా 3D ప్రింటింగ్ కోసం తాజా టెక్నాలజీ డెవలప్‌మెంట్, మార్కెట్ డిమాండ్ గురించి తెలుసుకోవాలి. 3డీ ప్రింటింగ్ అనేది నిరంతరం నేర్చుకునే ప్రక్రియ. కాబట్టి స్కిల్స్ విషయంలో నిరంతరం అప్‌డేట్‌గా ఉండాలి.