మనోజ్ పంది **లోడా డైలాగ్ కి తల పట్టుకుంటున్న మంచు లక్ష్మి...వీడియో వైరల్!

MADDIBOINA AJAY KUMAR

ప్రస్తుతం నడిచేది సోషల్ మీడియా యుగం. టీవీలు, థియేటర్ల నుండి జనాలు పక్కకు జరిగి సోషల్ మీడియాలోనే కలం గడిపేస్తున్నారు. తీరిక సమయం దొరికిందంటే చాలు ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ యాప్ లలో కంటెంట్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో మీమ్స్, రీల్స్ కు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. కంటెంట్ క్రియేట‌ర్లు కొత్త కొత్త ఆలోచనలతో కంటెంట్ తీసుకొస్తున్నారు. ఇక సెలబ్రిటీలు ఏమైనా మాట్లాడినా.. ఏమైనా చేసినా ట్రోలర్స్ చేతికి చిక్కారంటే ఒక ఆట ఆడుకుంటారు. అయితే అలాంటి ట్రోల్స్ ను కొంతమంది పట్టించుకుంటే కొంతమంది చాలా పాజిటివ్ గా తీసుకొని నవ్వేస్తారు.
తాజాగా మంచు మనోజ్ మాట్లాడిన ఒక పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల మనోజ్ తండ్రి మోహన్ బాబు మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ ఓసారి ఇంటిదగ్గర గొడవ జరగ్గా గేటు బయట నిల‌బ‌డి గేటు తీయాల‌ని త‌న కూతురు ఇంట్లో ఉంద‌ని సెక్యూరిటీ సిబ్బందిని పంది **పక్కకు జరుగు రా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అయింది. ఇక ఈ డైలాగ్ పట్టుకున్న ట్రోల‌ర్స్ తమదైన స్టైల్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి పంది ** అనే పదాన్ని ట్రోల్ చేస్తూ వీడియో చేయగా ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనికి మంచు మనోజ్ నవ్వుతూ కామెంట్ చేయడం ఒక హైలెట్ అయితే మంచు లక్ష్మి ఇదే వీడియోకు తల పట్టుకున్నట్టు ఏమోజిని షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కు రీచ్ ఇంకా పెరిగిపోయింది. మనోజ్ ట్రోల్స్ ను పాజిటివ్ గా తీసుకోవడంపై నెటిజెన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: