బాలయ్య పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ .. యంగ్ టైగర్ అభిమానులను బుజ్జగిస్తూ నాగ వంశీ ట్వీట్ వైరల్..!
ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది .. జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రతిసారి ఎలా అవమానిస్తూనే ఉంటారా ? బాబి ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా తీశాడు కదా అది ఎందుకని అతని ప్రస్తావన తీసుకురాలేదంటూ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు .. డాకు మహారాజ్ సినిమాని థియేటర్స్ లో చూడకుండా బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ కూడా చేశారు .. అయితే ఈ ట్రోల్స్ చూసిన వెంటనే స్పందించిన డాకు మహారాజ్ నిర్మాత నాగ వంశీ ఒక ట్వీట్ వేశాడు .. ఆ ట్వీట్‌లో ఆయన ఈ విధంగా స్పందించారు .. ఇది కేవలం నా సినిమా కాదు మన అందరి సినిమా .. నాకు మీ అందరి సపోర్ట్ కచ్చితంగా కావాలి.. అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా అందరం ప్రశాంతంగా ఉండి సంక్రాంతికి ఈ సినిమాని మంచి హిట్ చేసుకుందాం అంటూ ఆయన ఎన్టీఆర్ అభిమానులను శాంతించేలా ఒక పోస్ట్ పెట్టాడు .
అయితే ఈ విషయం అంతా పక్కన పడితే ఈ షో గురించి ఎవరికీ తెలియని మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది .. అదేమిటంటే ఎన్టీఆర్ గురించి కూడా బాలయ్య అడిగాడని ఆ షో డైరెక్టర్ BVS రవి ఆ షార్ట్ ని కత్తిరించాడని కూడా అంటున్నారు .. కావాలనే ఉద్దేశపూర్వకంగా నందమూరి అభిమానుల మధ్య చీలిక వచ్చేలా BVS రవి ఇలా చేశారంటూ సోషల్ మీడియాలో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు . అయితే దీనిపై BVS రవి ఎలా స్పందిస్తాడో చూడాలి .. అయితే ఇదే నిజమైతే మాత్రం బయట తిరగలేవు జాగ్రత్త అంటూ ఎన్టీఆర్ అభిమానులు అతనికి వార్నింగ్ ఇస్తున్నారు . ఇక మరి రాబోయే రోజుల్లో అయినా బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి అన్ స్టాపబుల్ షోలో కనిపించాలని కూడా కోరుకుంటున్నారు.. మరి రాబోయే రోజుల్లో ఆయన ఈ బాబాయి - అబ్బాయి కలిసి కనిపిస్తారా లేదో చూడాలి .