అఖిల్ సినిమాలో ఫేమస్ బాలీవుడ్ విలన్ ?
ఇక మొత్తానికి అక్కినేని అఖిల్ 2025లో కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు మురళీకృష్ణ దర్శకత్వంలో అఖిల్ సినిమాని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. "లెనిన్" అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించబోతోంది.
శ్రీ లీల ఎంట్రీ అన్నది ఈ ప్రాజెక్టుకి పాజిటివ్ సైన్ గా కనిపిస్తోంది. లెనిన్ అనే టైటిల్ ని బట్టి చూస్తే ఈ సినిమా భారీ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కనుందని అర్థం అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అఖిల్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడట దర్శకుడు.
కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ విలన్ పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. "1992 స్కామ్" తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రతీక్ గాంధీ. ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రతీక్ గాంధీ అయితే తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి అఖిల్ ఈ సినిమాతో నైనా సక్సెస్ అందుకుంటాడా లేదా అని అభిమానులు ఆరాటపడుతున్నారు.