బుల్లిపిట్ట: రెడ్మీ మొబైల్ పై భారీ తగ్గింపు. ఎంత అంటే..?

Divya
రెడ్మీ మొబైల్స్ ప్రస్తుతం ఇప్పుడు వినియోగిస్తున్న మొబైల్స్ అన్ని ఎక్కువగా చౌకధరల కి లభిస్తున్నాయి. తాజాగా టెన్ సిరీస్ కింద రెడ్మీ నోట్ 10s స్మార్ట్ ఫోన్లో రెండు వేరియంట్లలో విడుదల చేసింది . ఇందులో 6GB+64 GB మెమొరీ సామర్థ్యం మరియు 6GB+128 GB మెమొరీ సామర్థ్యం తో మొబైల్స్ ను విడుదల చేసింది. అయితే వీటి ధరలను తాజాగా వివరించబడ్డాయి. 2021లో ప్రారంభించబడిన redmi NOTE -10S సిరీస్ మొబైల్ ధర రూ.2000 వేల రూపాయలను తగ్గించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ మొబైల్ రూ.12,999 రూపాయలకే తీసుకోవచ్చు. ఇక ఇందులో 6GB+128 GB మరొక మొబైల్ ను కూడా రూ.1000 రూపాయల వరకు తగ్గించింది. ఈ స్మార్ట్ మొబైల్ రూ.14,999 రూపాయలకి అందుబాటులో కలదు. ఈ మొబైల్ యొక్క ఫీచర్లను ఇప్పుడు మనం చూద్దాం.
RED MI NOTE-10S స్పెసిఫికేషన్:
ఈ మొబైల్ 6.43 అంగుళాలు ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో కలదు. వినియోగదారులు ఇందులో 1080X2400 పిక్సెల్ రెజల్యూషన్ పొందవచ్చు.  డిస్ప్లే పైన 3 కోటింగ్ తో డిస్ప్లే స్క్రాచ్ రెసిస్టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం తో వర్క్ అవుతుంది. ఈ స్మార్ట్ మొబైల్ని 2022లో మనకి లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో చేయడం జరిగింది. ఇక ఇందుకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
NOTE-10S వినియోగదారులు క్వాడ్ రియర్ కెమెరాను పొందవచ్చు. వెనుక భాగంలో 48 mp ప్రైమరీ కెమెరా 8 mp ULTRA WIDE కెమెరాతో పాటు 2MP, రియర్ కెమెరా, 2MP మైక్రో కెమరను కూడా అందుబాటులో ఉంచింది. సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 13MP ఫిక్సల్ గా అందుబాటులో ఉంచింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000MAH బ్యాటరీ తో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: