బుల్లిపిట్ట: మీ స్మార్ట్ మొబైల్ స్లో గా ఉందా అయితే వీటిని పాటించండి..!!

Divya
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేనిది మనం ఏ పని చేయలేమని చెప్పవచ్చు ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకూ చాలామంది స్మార్ట్ ఫోన్ లోనే తమ పని చేసుకుంటూ ఉంటారు. దీంతో స్మార్ట్ఫోన్ వినియోగదారుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది వీటితో పాటుగా ఫోన్ యూజర్స్ చాలామంది తమ మొబైల్స్ స్లో అవుతోందని తెలియజేస్తూ ఉంటారు. ఫోన్ లలో అడ్డగోలుగా ఫోటోలు వీడియోలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా మొబైల్ వేగవంతం అవుతుందని చెప్పవచ్చు. అయితే మొబైల్ నుంచి వేగంగా స్మూత్ గా మారడం మన చేతుల్లోనే ఉంటుంది స్మార్ట్ మొబైల్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు.. మీ మొబైల్ వేగవంతంగా పని చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లో ఉండే ఈ టిప్స్ చాలని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు వాటి గురించి చూద్దాం.
ముఖ్యంగా మొబైల్ సెట్టింగ్ లో ఓపెన్ చేసి..About అనే వాటిని ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అయిందో లేదో చూడండి... ఒకవేళ కాకపోతే ఆ వెంటనే అప్డేట్ చేయాలి. ఆ తరువాత గూగుల్ ప్లే స్టోర్ లో ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పైన క్లిక్.manage app and device చేయవలసి ఉంటుంది.. ఒకవేళ అందులో ఏవైనా యాప్స్ అప్డేట్ చేయకుంటే చేయాలి.
మీ స్మార్ట్ ఫోన్లు యానిమేషన్ స్లోగా వర్క్ అవుతూ ఉంటే .. సెట్టింగ్ ఓపెన్ చేసి..about పైన క్లిక్ చేసి..Build number పైన ఏడు సార్లు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ వెంటనే డెవలపర్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. ఆ తరువాత యానిమేషన్ మొత్తం ఆఫ్ చేయాలి.
ఇక మరొకటి ఏమిటంటే..  సెట్టింగ్ లో స్టోరేజ్ పైన క్లిక్ చేసి.. అవసరం లేని ఫైల్స్ని డిలీట్ చేయాలి. ముఖ్యంగా ఏదైనా ఫైల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ మెమొరీ కార్డు లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాంటివి పాటించడం వల్ల మీ మొబైల్ వేగవంతంగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: