వాట్సప్ : వావ్! యూజర్లకు అదిరిపోయే క్యాష్ బ్యాక్!

ఇక వాట్సప్ రోజు రోజుకు సరికొత్త ఆఫర్లను వినియోగదారులకు అందిస్తుంది. మారుతున్న కాలానుగూణంగ ప్రజలు యూపీఐ లాంటి సేవలను కూడా చాలా అధికంగా వినియోగించుకుంటున్నారు.ఇక క్షణాల్లో డబ్బును ఒకరి నుండి మరొకరికి చేరవేసేందుకు ఇలాంటి డిజిటల్ సేవలు అనేవి చాలా బాగా పెరిగిపోయాయి. ఫలితంగా జనానికి ఈ సేవలు చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. గతంతో పోల్చుకుంటే వీటిని వినియోగించే వారి సంఖ్య కూడా చాలా గణనీయంగా పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే కేంద్ర ఇంకా అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త యాప్స్ అభివృద్ధి చేసి వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దాని ఫలితంగా కొత్త యాప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా డిజిటల్ లావాదేవీలు కూడా ఇప్పుడు మరింత సులభతరం అయ్యాయి.తాజాగా వాట్సప్ మెసెంజర్ యాప్ ఒక కొత్త ఆఫర్ ని వినియోగదారులకు ప్రకటించింది. ఇప్పటికే వాట్సప్ యూపీఐ పేమెంట్స్ అందిస్తున్న విషయం కూడా అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే కస్టమర్లను ఎంతగానో ఆకర్షించేందుకు గాను క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఎంపిక చేసింది. ఇక ఇందులో ఎంపిక చేసిన కష్టమర్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని వారికి మాత్రమే ఈ ఆఫర్ అంటూ ప్రకటించింది. వాట్సప్ పేమెంట్ అనే ఫీచర్ ద్వారా ఇతరులకు పేమెంట్ చేస్తే మొదటి మూడు లావాదేవీలకు గాను రూ.35 చొప్పున ఇంకా అలాగే రూ.105 డబ్బును క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇక ఒక్క రూపాయి నుండి ఎంత పేమెంట్ చేసినా కూడా రూ.35 క్యాష్ బ్యాక్ అందిస్తుంది వాట్సప్.


ఈ డిజిటల్ లావాదేవీలు అత్యధికంగా వాట్సప్ ద్వారానే చెయ్యాలన్న ఉద్దేశ్యంతోనే వాట్సప్ ఈ యాప్ ని తీసుకొచ్చింది. ఈ తక్కువ కాలం ఆఫర్ కేవలం ఎంపిక చేసిన కష్టమర్లకు మాత్రమేనని వాట్సప్ కంపెనీ ప్రకటించింది.ఇక ఇందుకోసం కస్టమర్లు యూపీఐ పేమెంట్స్ యాక్టివేట్ చేసుకోవాలి. వాట్సప్ పెమెంట్స్ సెక్షన్ లోకి వెళ్లి మీ బ్యాంక్ వివరాలు కూడా నమోదుచేసుకోవాలి. ఆ తరువాత మీరు ఎవరికైతే డబ్బులు పంపాలో ఆ యూజర్ కాంటాక్ట్ ను ఓపెన్ చేసి ఎంత అమౌంట్ పంపాలో అంత టైప్ చేసి యూపీఐ నెంబర్ ని ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత అమౌంట్ అనేది వారికి వెళుతుంది.ఇక అమౌంట్ వెళ్లిన అనంతరం క్యాష్ బ్యాక్ ని పొందవచ్చు. ఇలా మూడు సార్లు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం మీకు వుంది. ఇందుకు ఇప్పటికే చాలా మంది కూడా ఈ ఆఫర్లను వినియోగించుకుని క్యాష్ బ్యాక్ పొందాలని సిద్ధంగా వున్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వాలు  కూడా ప్రోత్సహించడంతో ప్రజలు అధిక సంఖ్యలో వాట్సప్ ప్రకటించిన ఆఫర్ మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: