బుల్లిపిట్ట: ఈ మెయిల్ తో ఇలా చేస్తున్నారా.. అయితే ప్రమాదం లో ఉన్నట్లే..!!

Divya
ఒక ఈమెయిల్ తో ఎన్ని పనులైనా చేసుకునే సదుపాయం కలదు. అయితే వీటిని ఎక్కువసార్లు కొన్నిచోట్ల ఉపయోగించుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆర్థిక లావాదేవీలు జరిపే వాటిలో రిజిస్ట్రేషన్ కోసం ఈ ఈమెయిల్ ఐడి ని ఉపయోగిస్తే అనుకోని ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉందట. ముఖ్యంగా ఆన్లైన్ మోసగాళ్ల బారిన చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుత్వమే తెలియజేస్తోంది.
ఏదైనా ఆర్థిక లావాదేవీలు సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లలో రిజిస్ట్రేషన్ కోసం ఎవరు కూడా ఈ మెయిల్ ఐడి ని ఉపయోగించకూడదని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి పనులకు వేరువేరు ఈ మెయిల్ ఐడిలను సృష్టించుకొని ఇవ్వాలని ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. దీనివల్ల మనం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉండదు అంటూ తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా మోసాలకు పాల్పడే వారు ఇలాంటి ఫేక్ మెయిల్స్ని పంపుతూ ఉంటారు.  దీంతో ఈ-మెయిల్ లింక్ చేయగానే మన బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరాలు వారికి చేరుతాయి. అందుచేతనే ఇలాంటి ఈ - సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక కొత్త మెయిల్ ఐడిని సృష్టించి వారికి ఇవ్వడమే పరిష్కారమని ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి.

ప్రభుత్వం ఏం చెబుతోందంటే సైబర్ భద్రత పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. కేంద్ర ప్రభుత్వం సైబర్ దోస్త్ అనే పేరుతో ట్విట్టర్ ను  నిర్వహిస్తోంది. ట్విట్టర్ హ్యాండిల్  సైబర్ క్రైమ్ కు చెందిన వాటికి సలహాలను కూడా అందిస్తుంది. ఆన్లైన్ ప్రపంచంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి .. ఎలా ఉండాలి అనే విధంగా వాటిని వివరిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రెండు వేరువేరు ఈమెయిల్ ఐడీలను క్రియేట్ చేసుకొని అందులో ఒక దానిని లావాదేవీలకు ..మరొక వాటిని సోషల్ నెట్వర్కింగ్ వాటి కోసం ఉపయోగించుకోవాలని తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: