సైన్స్ : దోమలు ఎక్కువగా ఎవరిని కుడతాయో తెలుసా?

ఇక మనం ఆక్సిజన్‌ పీల్చుతూ కార్బన్‌ డై ఆక్సైడ్‌ను వదులుతామనే విషయం అందరికి కూడా తెలిసిందే. దోమలకు కార్బన్‌ డై ఆక్సైడ్‌ అంటే చాలా ఇష్టం. 160 అడుగుల దూరంలో ఉండి కూడా కార్బన్‌ డై ఆక్సైన్‌ వాసనను గుర్తించే పవర్ ఉంటుంది దోమలకు. లావుగా ఉన్నవాళ్లు ఇంకా అధిక బరువు ఉన్న వారు ఎక్కువగా కార్బన్‌ డైఆక్సైన్‌ను విడుదల చేస్తారు. అందుకే వారిని ఎక్కువగా దోమలు కుడుతుంటాయని పలు పరిశోధనలలో స్పష్టంగా తేలింది.దోమలు ఎక్కువగా చెమట వాసనను గుర్తిస్తాయి. మన శరీరం నుంచి వచ్చే చెమటలో లాక్టిక్‌ యాసిడ్‌, యూరిక్‌ యాసిడ్‌ ఇంకా అలాగే అమ్మోనియం వంటివి ఉంటాయి. అవి దోమలకు చాలా ఇష్టమట. ఎవరైనా బాగా శ్రమించి చెమటతో ఉంటే వారిని దోమలు కుట్టేస్తాయట. చెమట వాసన ద్వారా దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయని 2015లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. అలాగే శరీరంపై దుర్వాస ఉంటే దోమలు త్వరగా ఆకర్షితులవుతాయని 2011లో నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం తేలింది.ఇక మన శరీరంపై స్కీన్‌ చాలా శుభ్రంగా ఉండాలి. అలాగే కురుపులు ఇంకా గాయాలు ఉండకుండా చూసుకోవడం మంచిది.


చర్మాన్ని ఎప్పటికప్పుడు కూడా శుభ్రం చేసుకోవాలి. గాయాలు ఇంకా అలాగే కురుపులు ఉండటం కారణంగా సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దోమలు కూడా చాలా ఎక్కువగా వాలుతాయి.అలాగే ఇక గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువగా కార్బన్‌డై ఆక్సైడ్‌ ని విడుదల చేస్తారు. అందుకే అలాంటి వాళ్లను దోమలు చాలా ఎక్కువగా కుడతాయి. ఆఫ్రికాలో గర్భంతో ఉన్న మహిళలకు మలేరియా ఎక్కువగా సోకుతున్నదని ఓ పరిశోధనలలో స్పష్టంగా తేలింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భిణులను దోమలు 21 శాతం ఎక్కువగా కుడతాయని తేలింది. మన శరీరం ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేస్తుంది. మన చర్మానికి దగ్గరగా ఉండే నీటి ఆవిరి స్థాయిలు పరిసర ఉష్ణోగ్రతను బట్టి మారుతూ ఉండవచ్చు.అలాగే మద్యం సేవించిన వారిపై కూడా 2002లో ఓ అధ్యయనం నిర్వహించారు శాస్త్రవేత్తలు. బీర్‌ తాగని వారికంటే ఎక్కువగా బీర్ తాగేవారిని దోమలు చాలా ఎక్కువగా ఆకర్షిస్తాయని పరిశోధకులు గుర్తించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: