బుల్లి పిట్ట: సిమ్ కార్డు లేకుండా పనిచేసే మొబైల్..!!

Divya
ఇటీవలకాలంలో ఎక్కడ చూసినా సరే టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో భౌతిక పరికరాల వాడకాన్ని తగ్గించి వాటికి బదులుగా ఎలక్ట్రానిక్ పద్ధతులను ఉపయోగించుకునే విధంగా సాంకేతికత కూడా అందుబాటులోకి రావడం జరిగింది. సెల్ ఫోన్.. సిమ్ కార్డు వంటి సూక్ష్మ అంశాల్లో కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ పద్ధతి అందుబాటులోకి రావడం గమనార్హం. ఇక ఇప్పటికే సిమ్ కార్డ్ మినీ.. మ్యాక్సీ.. మైక్రో.. నానో సిమ్ లుగా రూపాంతరం చెందినది. ఇకపై సిమ్ కార్డు కూడా పూర్తిగా కనుమరుగవుతోంది. ఎందుకంటే సిమ్ కార్డు స్థానంలో ఎలక్ట్రానిక్స్ విధానం అందుబాటులోకి రావడం జరిగింది..
ప్రస్తుతం మొబైల్ ఫోన్లో భౌతిక రూపంలో ఉన్న సిమ్ కార్డు స్థానానికి బదులుగా ఈ - సిమ్ పని చేయనుంది. ఇందుకోసం వినియోగదారులు సిమ్ కార్డు కి బదులుగా నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ప్రత్యేకంగా ఒక కోడ్ ను అయితే పొందాల్సి ఉంటుంది. ఇక మీరు కొనుగోలు చేసిన ఫోన్ మోడల్ వివరాలను నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కి అందిస్తే వారు మీకు ఒక కోడ్ ను అందిస్తారు.  ఇక పూర్తి వివరాలు వెరిఫికేషన్ అయిన తర్వాత ఈ - సిమ్ అనేది ఆక్టివేట్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఇక వినియోగదారులు సాధారణ భౌతిక సిమ్ కార్డ్ లాగే దీనిని మీరు ఉపయోగించడంతో పాటు దీని సేవలను కూడా పొందవచ్చు.

ప్రస్తుతం కొన్ని అధునాతన పరికరాలు లోనే ఈ విధానం వాడుతూ ఉండగా మరికొన్ని రోజుల్లో సాధారణ ఫోన్లలో కూడా ఈ- సిమ్ విధానం అందుబాటులోకి రానుంది అని సమాచారం . ప్రముఖ దిగ్గజ మొబైల్ బ్రాండ్ అయినటువంటి ఆపిల్ , హువాయ్ వంటి ఫోన్లలో మాత్రమే ఈ సౌలభ్యం ఉండగా త్వరలోనే ఆండ్రాయిడ్,  ఓఎస్ ఫోన్లలో కూడా ఈ పద్ధతి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.  నిజానికి మన దేశంలో ఆండ్రాయిడ్ , ఓఎస్ ఫోన్ లను  ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.  కాబట్టి వినియోగదారుల అభ్యర్థన మేరకు జియో , వోడాఫోన్ , ఎయిర్టెల్ వంటి సంస్థలు ఈ సేవలను అందించడానికి సిద్ధమవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: