ఫోన్ వినియోగంలో ఇండియా స్థానం, షాకింగ్ వివరాలు..

మొబైల్ వినియోగంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. గతేడాది 69,000 కోట్ల గంటలను ఫోన్‌లో ఖర్చు చేయడం జరిగింది. కరోనా మహమ్మారి భారతదేశాన్ని ఇంకా ప్రపంచాన్ని కొత్త డిజిటల్ యుగంలోకి నడిపించింది. ఆఫీస్ మీటింగ్‌లు ఇప్పుడు కాన్ఫరెన్స్ రూమ్‌లకు బదులుగా మొబైల్ ఫోన్‌లలో నిర్వహించబడుతున్నాయి. సినిమా హాళ్లలో సినిమాలు విడుదల కావు కానీ OTT, ఇంకా డబ్బుల స్థానంలో UPI వచ్చింది. యాప్ డేటా అనలిటిక్స్ సంస్థ యాప్ యానీస్ స్టేట్ ఆఫ్ మొబైల్ 2022 నివేదిక ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే.. మన భారతీయులు తమ మొబైల్ ఫోన్‌లలో 69,000 కోట్ల గంటలు గడిపారు. ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. 1,11,000 కోట్ల గంటల మొబైల్ వినియోగంతో చైనా ప్రజలు మొదటి స్థానంలో నిలిచారు. 11,000 గంటల మొబైల్ సమయంతో US మూడవ స్థానంలో నిలిచింది. 

ఇక నివేదిక యొక్క డేటా ప్రకారం.. 2021లో ప్రతి భారతీయుడు ప్రతిరోజూ సగటున 4.7 గంటలు తమ మొబైల్ ఫోన్‌లలో గడిపారు. రోజుకు మొబైల్ వినియోగంలో, బ్రెజిల్ మరియు ఇండోనేషియా (5.4 గంటలు), దక్షిణ కొరియా (5 గంటలు) మరియు మెక్సికో (4.8 గంటలు) వున్నాయి.భారతీయులు మొబైల్ అప్లికేషన్‌లను 2600 కోట్ల సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు, అందులో 100 కోట్ల డౌన్‌లోడ్‌లు యుపిఐ, బ్యాంక్ యాప్‌లు, స్టాక్‌లు, లోన్ యాప్‌ల వంటి ఫైనాన్షియల్ యాప్‌లు మాత్రమే. అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ ఇన్‌స్టాగ్రామ్ అయితే ఎక్కువ సమయం గడిపిన యాప్ డిస్నీ-హాట్‌స్టార్. వాట్సాప్‌లో అత్యధిక నెలవారీ వినియోగదారులు ఉన్నారు. ఇక భారతదేశంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన మొబైల్ గేమ్ లూడో కింగ్. చాలా సార్లు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడటం జరిగింది. ఇక యాప్ స్టోర్‌లో ఎక్కువగా శోధించిన కీలకపదాలు Whatsapp+, Zoom, google Meet , Scanner, Team.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: