బుల్లిపిట్ట:మీ ఇంటర్నెట్ డేటా స్పీడ్ పెరగాలంటే ఇలా చేయండి..!!

Divya
ప్రస్తుతం మనం ఎక్కువగా ఇప్పుడు మొబైల్ ఇంటర్నెట్ పైనే ఆధారపడి జీవించవలసి వస్తోంది.. అంతేకాకుండా ఈ రోజుల్లో అనుకున్నంత స్పీడ్ డేటా రాలేదని చెప్పవచ్చు. అది కేవలం సిగ్నల్ సమస్య అయినా కావచ్చు, లేదా మన మొబైల్ సమస్య అయినా కావచ్చు. విషయం ఏదైనా కొన్ని సార్లు మన మొబైల్లో డేటా స్పీడ్ చాలా నెమ్మదిగా వస్తుంది.. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిట్కాలను పాటిస్తే మీ మొబైల్ స్పీడ్ అమాంతం పెరిగిపోతుంది. వాటి గురించి చూద్దాం.
1). మొబైల్ ఫోన్ రీస్టార్ట్ చేయడం.. మొబైల్ నెట్వర్క్ అంత సెట్ చేస్తుంది కాబట్టి మొబైల్ ఇంటర్నెట్ ని చాలా వేగవంతంగా చేయడానికి ఇది బాగా సహాయపడుతుంది.
2). ఇక ఆ తర్వాత మొబైల్ ని ఫ్లైట్ మోడ్ లో ఉండి ఆన్ చేసి ఆఫ్ చేయడం వల్ల.. అప్పుడు కూడా మొబైల్ నెట్వర్క్ సెర్చింగ్ చేస్తుంది. కాబట్టి మన మొబైల్ లో ఇంటర్నెట్ వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.
3). ఒకవేళ అన్నీ బాగున్నా డేటా స్పీడ్ చాలా తక్కువగా వచ్చింది అంటే.. అప్పుడు మన డేటా అయిపోయిందో లేదో ఒకసారి చూడటం మంచిది.
4). మన మొబైల్లో ఉండేటువంటి యాప్ లను అప్డేట్ చేయడం కోసం.. మనం ఆటోమేటిక్ గా డౌన్లోడ్  అప్డేట్ అనే ఆప్షన్ ని ఆన్ చేసిన వారు ఎవరైనా.. దాన్ని వెంటనే ఆపివేయడం చాలా మంచిదట. అలా ఉన్నప్పుడు కూడా ఇంటర్నెట్ చాలా నెమ్మది గా వస్తుందని కొంతమంది నిపుణులు తెలియజేయడం జరిగింది.
5). ముఖ్యంగా మన మొబైల్ లో ఉండే సెట్టింగులను మార్చినప్పుడు కూడా ఇంటర్నెట్ నెమ్మది గా వస్తుందట. అలా మార్చేటప్పుడు మన మొబైల్ లో ఉండే నెట్వర్క్ సెట్టింగ్ లను ఒకసారి రీస్టార్ట్ చేసి మార్చడం మంచిది.
ఈ విధంగా చేయడం వల్ల మన మొబైల్ డేటా స్పీడు పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: