బుల్లి పిట్ట:అమెజాన్ నుండి అన్నిటిపై 40% ఆఫర్..4 రోజులే..!!

Divya
తాజాగా అమెజాన్ దిగ్గజ సంస్థ రిపబ్లిక్ డే సందర్భంగా.. ఈనెల 17 నుంచి సరికొత్త ఆఫర్లతో నాలుగు రోజులపాటు గ్రేడ్ సేల్ అందుబాటులో ఉంచుతుంది. ఈ అమెజాన్ సేల్ లో 40% డిస్కౌంట్లతో స్మార్ట్ మొబైల్ ను అందించనుంది. అయితే ఈ అమెజాన్ కేవలం ప్రైమ్ యూజర్లకు నాలుగు రోజుల కంటే ముందుగానే అందించనుంది. అంటే ఈనెల 16 నుంచే మధ్యాహ్నం 12:00PM నుంచి మనం ఈ ఆఫర్ లను ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్ లు జనవరి 20వ తేదీన ముగియనున్నాయి. ఈ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. హిందీ , తెలుగు , మలయాళం వంటి భాషలతో పాటు గా 8 భాషలలో ఈ సేల్స్ ని అందుబాటులో ఉంచింది.
ఈ ఆఫర్ ను అమెజాన్ వినియోగదారుల తమ సొంత భాషల్లోనే వాయిస్ ద్వారా షాపింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇక ఇందులో ఎక్స్చేంజి ఆఫర్ లను కూడా మనం ఎంచుకోవచ్చు. గరిష్టంగా 16 వేల రూపాయల వరకు మనం ఎక్స్చేంజి ఆఫర్ ను పొందవచ్చు.ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే లో ల్యాప్ టాపు లు, మొబైల్ ఫోన్లు, ఇంటికి సంబంధించి వంటివాటిపై డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ లను అందించనుంది. ముఖ్యంగా ఆపిల్, షియోమి, సాంసంగ్, రియల్ మీ, వన్ ప్లస్ తదితర వంటి బ్రాండ్ కలిగిన స్మార్ట్ మొబైల్స్ పైన ఆఫర్లను అందించనుంది. ఉచితంగా డోర్ డెలివరీ చేయబడుతోంది.
డెలివరీ అమౌంట్ పే చేసేటప్పుడు..SBI క్రెడిట్ కార్డు ద్వారా పే చేసినట్లు అయితే..10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ బ్యాంకు తో పాటు ఐసీఐసీఐ బ్యాంకు కార్డు, బజాజ్ వంటి వాటిపై కూడా అనేక ఆఫర్లను, క్యాష్ బ్యాక్ లను ప్రదర్శించింది. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ అయితే అందరి కంటే ముందుగా యాక్సిస్ పొందే అవకాశం ఉంటుంది. ఇక అంతే కాకుండా కొన్ని స్మార్ట్ టీవీ ల పై 60 % డిస్కౌంట్ ను కూడా ప్రకటించింది.ఎలక్ట్రిక్ వస్తువులపై 70% మరియు ఇతర ప్రొడక్టులపై 50% డిస్కౌంట్ ను అందించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: