మనిషి జుట్టుతో కూడా వస్త్రాలు తయారు.. ఎక్కడంటే..!

MOHAN BABU
సాధారణంగా జంతువుల వెంట్రుకలు నుంచి దుస్తులు తయారు చేయడం చూశాం. అయితే ఆమ్ స్టర్ డామ్ కు చెందిన డిజైనర్ సోఫియా కొల్గర్.. తాజాగా మనుషుల జుట్టుతోనూ బట్టలు రూపొందించింది. యానిమల్ హెయిర్ మాదిరిగానే కెరాటిన్, ప్రోటీన్,  ఫైబర్ కలిగిన మానవ వెంట్రుకలను వస్త్రాల ఉత్పత్తికి ఎందుకు ఉపయోగించ కూడదనే ఆలోచనతో ముందుకు సాగిన ఆమె..ఈ దిశగా విజయం సాధించింది. పర్యావరణ హితమైన ఈ కాన్సెప్ట్ టెక్స్ టైల్ ఇండస్ట్రీని తలకిందులు చేసేలా ఉండగా.. భవిష్యత్తులో ఈ ఇండస్ట్రీ గొప్పగా పరిణామం చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దుస్తుల తయారీ కోసం ముడి పదార్థాలను సేకరించేందుకు సెలూన్ల చుట్టూ తిరిగిన సోఫియా.. ఒక్క యూరప్ లోనే ఏటా 72 మిలియన్ కేజీల వేస్ట్ హెయిర్ జనరేట్ అవుతుందని తెలిపింది. ఘన వ్యర్థ ప్రవాహాలు..

 డ్రైనేజీ వ్యవస్థల్లో పేరుకుపోయి ఇబ్బందులు పెడుతున్న  జుట్టును వస్త్ర తయారీలో ఉపయోగించి కొన్ని సమస్యలకు చెక్ పెట్టాలనుకుంటున్నట్లు చెప్పింది. ఈ క్రమంలోనే హ్యూమన్ మెటీరియల్ లూప్ సంస్థను స్థాపించి సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. హ్యూమన్ హెయిర్ అనేది కాటన్, ఊలు మాదిరి ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే మెటీరియల్..కాబట్టి ఇది లోకల్ ప్రొడక్షన్ కు అనువుగా ఉంటుందని, స్థానికుల జీవనోపాధికి సాయపడు తుందని తెలిపింది.

అంతేకాదు జంతువుల వెంట్రుకలను వస్త్రాల తయారీలో ఉపయోగించాలంటే రక్తం, మలం తొలగించేందుకు కెమికల్స్ యూజ్ చేయాల్సి ఉంటుందని.. మనుషుల జుట్టుతో  అలాంటి ఇబ్బందులేవి ఉండవని, అల్టిమేట్ గా సొల్యూషన్ కు  తావుండదని వివరించింది. హ్యూమన్ లూప్ మెటీరియల్ ద్వారా ఇప్పటి వరకు ఒక జంపర్ ప్రోటోటైప్ తయారు చేసినట్లు సోఫియా తెలిపింది. నెదర్లాండ్స్ లో జుట్టును సేకరించినందున ప్రోటోటైప్ ను డచ్ బ్లోండ్ అని పిలుస్తూ ఉండగా 100 శాతం రీసైకిల్ చేసిన మానవ జుట్టుతో ప్రస్తుతం ఇటలీలోని స్పిన్నింగ్ మిల్లులో నూలు ఉత్పత్తి జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: