బుల్లిపిట్ట:ఈ నెలలో రాబోతున్న టాప్-5 స్మార్ట్ ఫోన్స్ ఇవే..!

Divya
ఎంతో ఆతృతగా ఎదురు చూసిన 2022 వ సంవత్సరం రానే వచ్చేసింది. దీంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారికి తోచిన విధంగా వారి పని చేసుకుంటూ ఉన్నారు.. అయితే ఇప్పుడు నూతన సంవత్సరం ప్రారంభం నుంచే కస్టమర్లను ఆకట్టుకునేందుకు పలు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసేందుకు ఆయా బ్రాండెడ్ సంస్థలకు సంబంధించి మొబైల్స్ ను సిద్ధంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.
1).XIAOMI:
ఇందులో నుంచి ముఖ్యంగా xiaomi -11i,hyper charger వంటి మొబైల్స్ ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇందులో అత్యధికంగా కెపాసిటీ కలిగిన బ్యాటరీ గల మరొక మొబైల్ ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది.XIAOMI -11i,hypercharger ఈ రెండు మొబైల్ కి ఒకే విధంగా చార్జింగ్ సపోర్ట్ చేసే విధంగా తయారు చేయబడింది. ఇక ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే 6.67 అంగుళాలు కలదు. ఇది ఈ నెలలో మొదటి వారంలో విడుదల కావచ్చు.
2).infinix zero 5G:
ఇక ఈ సంస్థ బ్రాండెడ్ నుంచి రాబోతున్న 5g మొబైల్ ఇది. ఇందులో ఇప్పటికే ఎన్నో మొబైల్స్ విడుదలై బాగానే ఆకట్టుకున్నాయి. ఇంతవరకు వదిలిన మొబైల్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఈ మొబైల్ ఫీచర్లను తయారు చేసిందట. ఇందులో  8 GB RAM,128 GB మెమొరీ సామర్థ్యం కలది.
3).VIVO V23:
చైనా బ్రాండెడ్ కు చెందిన మరొక బిగ్గెస్ట్ పాపులర్ మొబైల్ ఫోన్ ఇది. ఈ యేడాది సరికొత్త సిరీస్ తో ఈ మొబైల్ ను ప్రారంభించనుంది.V-23 మోడల్స్ 2 మొబైల్ విడుదల చేయనుంది.. ఇక ఇందులో డిస్ప్లే 3D తో నిర్మించబడిందట. ఇక ఇది కూడా5- జి మొబైల్.
4).ONEPLUS:
ఇప్పటివరకు ఈ బ్రాండెడ్ నుంచి విడుదలైన మొబైల్స్ ను వినియోగదారులు బాగానే ఉపయోగిస్తున్నారు. ఇక తాజాగా ఈ బ్రాండెడ్ నుంచి ONE PLUS-10 PRO అనే మోడల్ విడుదల చేయబోతున్నారు. ఇక ఇందులో సరికొత్త ఫీచర్స్ తో పాటు  డిస్ప్లే 6.7 అంగుళాల తో ఉండి.. ఈ డిస్ప్లేను QHD వంటి క్వాలిటీతో అమర్చడం జరిగిందట. ఇవన్నీ ఈ నెలలోనే విడుదల అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: