ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్,పుష్పక విమానం, బేబి వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ సినిమాల్లో దూసుకుపోతున్న ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించారు. అయితే అలాంటి ఆనంద్ దేవరకొండ తాజాగా పెళ్లయిన తన అన్నా వదినలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట. ముఖ్యంగా వదిన ఇంట్లోకి అడుగుపెట్టడంతోనే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారట. మరి ఇంతకీ రష్మిక మందన్నాకి మరిది ఆనంద్ దేవరకొండ ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రష్మిక మందన్నా, ఆనంద్ దేవరకొండల మధ్య మంచి బాండింగ్ ఉంది.వీరిద్దరూ ఫ్రెండ్స్ లాగే ఉంటారు.
అలాగే రష్మిక మందన్నా ఆనంద్ దేవరకొండ నటించిన సినిమాలన్నింటికీ సపోర్ట్ చేస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంది. అయితే అలాంటి వీరి మధ్య ఉన్న బాండింగ్ విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకోవడంతో వదినే మరిది రిలేషన్ లోకి మారిపోయింది. అయితే రష్మిక మందన్నా విజయ్ దేవరకొండలు రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అలాగే మార్చ్ 4న హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ పార్టీని కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిసెప్షన్ కి సంబంధించిన పనులు పూర్తయిపోయాయి. ఇదిలా ఉంటే రష్మిక మందన్నా,విజయ్ దేవరకొండలు పెళ్లి చేసుకొని విజయ్ దేవరకొండ ఇంటికి వచ్చిన సమయంలో ఆనంద్ దేవరకొండ వదనకు అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారట.మరి ఇంతకీ రష్మిక మందన్నాకి ఆనంద్ దేవరకొండ ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనంద్ దేవరకొండ రష్మిక కి ఇంట్లో అడుగుపెట్టడంతోనే ఒక కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చారట. అయితే ఈ డైమండ్ నెక్లెస్ చూడడంతోనే రష్మిక చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వడంతో పాటు ఆనంద్ దేవరకొండ తన మీద చూపిస్తున్న ప్రేమకి కన్నీళ్లు పెట్టుకుందట. అయితే పెళ్లి జరిగిన సమయంలోనే ఆనంద్ దేవరకొండ తన తల్లితో కలిసి వదినకి గోల్డ్ నక్లెస్ గిఫ్ట్ గా ఇవ్వగా.. అన్నకి లగ్జరీ వాచ్ ని గిఫ్టుగా ఇచ్చారట. ఆ తర్వాత రష్మిక మందన్నా పెళ్లి చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టిన సమయంలో మరో కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఆనంద్ దేవరకొండ కి వదిన అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.