బుల్లి పిట్ట: సామాన్యులు కూడా కొనగలిగే బెస్ట్ బైక్స్ ఇవే..!

Divya
కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి.. ప్రతి ఒక్కరూ సొంత వాహనాల్లోనే ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కువగా టూ వీలర్స్ పైనే ఎక్కువ మక్కువ చూపడం గమనార్హం. దీంతో ప్రముఖ బైక్ తయారు చేసే సంస్థలు ఎక్కువగా వీటి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు పెరిగిన పెట్రోలు ధరలను దృష్టిలో ఉంచుకొని.. ప్రజలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ లనే ఎంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు చెప్పుబోయే బైక్.. కేవలం ఒక కిలో మీటర్ ని రెండు రూపాయల కంటే తక్కువ ధరకే మనం వెళ్ళవచ్చట. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.
అలా వచ్చిన బైకులు ప్రస్తుతం 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయట. అలాంటి వాటిలో ఎక్కువగా..HERO,BAJAJ,TVS బైకులు ముందువరుసలో ఉన్నాయ్ అని చెప్పుకోవచ్చు.
1). హీరో స్పెండర్ ప్లస్:
ఇక ప్రముఖ కంపెనీ అయిన హీరో నుంచి ఈ బైక్ ని 97.2 C.C ఇంజన్ తో తయారు చేసి ఉంటారు. ఇక ఇది పెట్రోల్ తో నడిచే టూ వీలర్. ఇందులో  మైలేజ్ వచ్చే విధంగా ఇంజన్  నిర్మించబడి ఉంటుంది.. అందుచేతనే ఈ బైక్ 62 కిలోమీటర్లకు పైగా మైలేజ్ వస్తుంది. ఇక దీని ధర.. రూ.64,850 అన్నట్లుగా ఉంది.
2). టీవీఎస్ రైడర్...125:
ప్రముఖ టీవీఎస్ కంపెనీ నుంచి..124.8 C.C ఇంజన్ తో తయారు చేయబడి ఉంటుంది. ఈ బైక్ లీటర్ కి 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ను ఇస్తుంది. ఈ బైకుని B-S6 మోడల్ లో కూడా విడుదల చేయడం జరిగిందట.
3). హోండా సిడి110  డ్రీమ్ :
హోండా బైక్ ను కొనుగోలు చేసినట్లయితే మనకు 64.5 కే ఎమ్ పీ ఎల్ మైలేజ్  ను ఒక లీటర్ కి అందిస్తుంది. 109.55 సిసి ఇంజన్ తో తయారు చేశారు.. ప్రస్తుతం ఈ బైక్ ద్వారా రూ. 76,629.
ఇక వీటితో పాటు బజాజ్ హండ్రెడ్ ప్లాటినమ్ బైక్ కూడా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: