బుల్లి పిట్ట: గూగుల్ క్రోమ్ ఉపయోగించే వారు జాగ్రత్త అంటున్న ప్రభుత్వం..!

Divya
మన ఉపయోగించేటటువంటి మొబైల్ లో ఎక్కువగా ఏదైనా సెర్చింగ్ చేయాలంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఉపయోగిస్తూ ఉంటాము. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బందులు పడతారని విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తోంది. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం.
ఇండియాలో ఉండేటువంటి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వారు.. మనం ఉపయోగించే గూగుల్ క్రోమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండండి అంటూ హెచ్చరిస్తున్నారు. గూగుల్ క్రోమ్ లో ఉండేటువంటి బగ్  వినియోగదారుల సమాచారాన్ని ఇతరులు కొట్టేసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఇబ్బంది కలగకుండా గూగుల్ సంస్థ ఒక ప్రతిపాదనను తీసుకువచ్చి వాటిని సరిదిద్దే నట్లు తెలియజేశారు. అందుచేతనే గూగుల్ క్రోమ్ ఉపయోగించేవారు కొద్దిరోజులు ఉపయోగించవద్దని అంటూ తెలియజేస్తున్నారు.
ఇక అంతే కాకుండా దీనిని తాజాగా అప్డేట్ కూడా చేయడం జరిగిందట. ఇక ఈ బ్రౌజర్ ఉపయోగించుకునే ఎటువంటి వారైనా సరే పాత దానిని అన్ ఇన్స్టాల్ చేసి.. సరి కొత్తగా వచ్చిన అప్డేట్ మీ ఇంస్టాల్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాలకు, ఇతరులకు జారీచేసింది గూగుల్ సంస్థ. ఇక వీటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించండి అంటూ ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది. ఇక తాజాగా వచ్చిన గూగుల్ క్రోమ్..22 రకాల భద్రత పరిష్కారాలను పరిష్కరించి మన ముందుకు వచ్చినట్లు తెలియజేశారు.
ఒకవేళ మీరు పాత క్రోమ్ వాడుతున్నట్లయితే హ్యాకర్లు వాటిని ఉపయోగించి వేరే విధంగా వారు ఉపయోగించుకుంటున్న ట్లుగా తెలియజేశారు. వారు మీ గూగుల్ క్రోమ్ లోకి మాల్వేర్ ను ఇంజెక్ట్ చేయడం వల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని తెలియజేశారు.ఇక అందుచేతనే ఈ కంపెనీ సంస్థ ఒక ఒక అప్ డేట్ ను విడుదల చేసింది. దీనిని ఎలాగైనా  మీరు అప్డేట్ చేసుకోవాలంటూ కోరుకుంటోంది గూగుల్ క్రోమ్ సంస్థ.. అందుచేతనే ఎవరైనా గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తే కొత్త వాటిని ఉపయోగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: