బుల్లి పిట్ట: జిమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయారా.. ఇలా చేస్తే సరి..!
మనం ఎటువంటి సమాచారాన్ని అయినా భద్రంగా సేవ్ చేసుకోవాలన్నా, పంపించాలన్న ఎక్కువగా ఉపయోగించేది జిమెయిల్ నే. వీటిని ఎక్కువగా ఏదైనా కంపెనీ ఆఫీసులలో, వ్యక్తిగత విషయాలను పంపించుట కు బాగా ఉపయోగపడుతుంది. ఇక ఏదైనా కొత్త మొబైల్ కొన్నా వారు ఆ మొబైల్ ఆపరేటింగ్ చేయాలంటే ఖచ్చితంగా జిమెయిల్ ఖాతా ఉండాల్సిందే. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో కచ్చితంగా ఉపయోగిస్తారు.
ఇంత ముఖ్యమైనటువంటి జిమెయిల్ కొన్ని కారణాల చేత మనం పాస్వర్డ్ మరిచినట్టు అయితే.. ఏదైనా సమయంలో ఉపయోగించుకునేన్నప్పుడు పాస్వర్డ్ మర్చిపోతే.. ఎలా పొందాలో ఎప్పుడు చాలా సులువైన పద్ధతిలో తెలుసుకుందాం.
1). మొదటగా మీ మొబైల్ , ల్యాప్ టాప్ వంటి వాటిలో ఉండేటువంటి గూగుల్ అకౌంట్ ను, జిమెయిల్ ను ఓపెన్ చేయాలి.
2). అలా ఓపెన్ చేసిన తర్వాత, అక్కడ పాస్వర్డ్ ఎర్రర్ చూపిస్తుంది. లేదంటే forget password పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.
3). ఒకవేళ మీకు చివరిగా ఉన్న నాలుగు అంకెల పాస్వర్డ్ ను ఎంటర్ చేసేయండి. ఒకవేళ ఆ నాలుగు అంకెల గుర్తు లేకపోతే..try another way "అనే ఆప్షన్ను ఎంచుకోవాలి.
4). మీరు మి జిమెయిల్ ఖాతాకు లింకు చేయబడి నటువంటి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసిన ఎడల నాలుగు అంకెల మెసేజ్ వస్తుంది. అప్పుడు వాటిని ఎంటర్ చేయాలి.
5). ఇక మనం మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే.. గూగుల్ కూ కూడా ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. వాటిని ఎంటర్ చేయడం వల్ల ఓపెన్ అవుతుంది.
6) అలా న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఆ తరువాత కొత్త పాస్ వర్డ్ ని సెట్ చేసుకోవాలి. ఆ తరువాత జిమెయిల్ లో లాగిన్ అవ్వాలి.