బెడ్ రూమ్ లో.. ఉల్క.. !

అంతరిక్షం గురించి అనేక పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యాలు ఇంకా అక్కడ ఎన్నో దాగి ఉన్నాయని వాళ్ళే చెపుతుంటారు. అయితే అవన్నీ తెలుసుకోవడానికి కాకపోయినా, భూమిపై నివసించే వారికి అక్కడ ఏమైనా ఉపయోగకరమైనవి ఉన్నాయా అనే కోణంలో మాత్రం వారి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉల్కలను గురించి తెలుసుకున్నారు. అవి అంతరిక్షం నుండి అత్యంత వేగంతో కిందకు పడే సమయంలో కొన్నిసార్లు భూమిని తాకే అవకాశాలు ఉన్నాయంటూ అప్పుడప్పుడు అలాంటివి పడే సమయాన్ని కూడా లెక్కించి, భూమికి ఎంత దగ్గరగా వస్తాయి లాంటి విషయాలు వాళ్ళు ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే కొన్ని ఉల్కలు భూమికి దగ్గరగా వచ్చి పోతున్న దృశ్యాలు ఈ తరాలు కూడా ఆయా సమయాలలో చూశాము కూడా. అయితే అవి వచ్చే వేగానికి అందులో ఉన్న కరిగి ఆవిరై వాటి పరిమాణం రీత్యా చిన్న ముక్కగానో లేదా అసలు పూర్తిగా ఆవిరైపోవటమో జరిగిన సందర్భాలు ఎక్కువ. ఇంకొన్ని సార్లు అవి భూమికి దగ్గరగా వచ్చినట్టే వచ్చి అక్కడ నుండి మరో మార్గానికి మళ్లడం కూడా చూశాం. కానీ అంత వేగంతో అవి వస్తున్నప్పుడు ఆవిరి అయిపోతున్నప్పటికీ, మిగిలిన కాస్త వచ్చి తగిలినా కూడా వచ్చే ప్రమాదం తక్కువేమి కాదు. ఉదాహరణకు చిన్న రాయి వేగంగా ఎవరిపైకన్నా విసిరితే ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది.  అదే తరహాలో ఉల్క చిన్నదైనా అది తగిలితే మాత్రం ప్రమాదమే అంటున్నారు వారు.
తాజాగా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని రూత్ హామిల్టన్ అనే మహిళకు అటువంటి అనుభవమే ఎదురైంది. అయితే ఆమెకు ఉల్క తాగలేదు కానీ, ఆమె నిదిరిస్తున్న సమయంలో అది వచ్చి బెడ్ మీద పడింది. అంటే అప్పటికే అది ఇంటి పైకప్పు ను చీల్చుకుంటూ వచ్చి ఆమె బెడ్ పై పడింది. ఆమెపై పడలేదు కాబట్టి సరిపోయింది. అదిపడ్డ సమయంలో శబ్దాన్ని బట్టి కంగారుగా లేచి చూడగా, ఆమె పక్కనే ఉల్క కనిపించడం చూసి కాసేపు ఆశ్చర్యానికి లోనైంది. అదే ఉల్క ఆమెపై పడిఉంటే అనే ఆలోచనలతో ఆమె రోజంతా భయంగానే గడిపిందట. ఆ స్థితి నుండి తేరుకున్న తరువాత అధికారులకు జరిగింది చెప్పగా, వాళ్ళు వచ్చి దానిని తీసుకుపోయారు. అధికారులు కూడా అది పడ్డ స్థితిని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇలా పడటం చాలా అరుదని వారు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: