బెస్ట్ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్

Vimalatha
స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌ల వాడుతున్న చాలా మంది వినియోగదారులు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా సేవలను ఉపయోగిస్తున్నారు. ఈ మూడు టెలికాం కంపెనీలు మంచి ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈరోజు అలాంటి కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. ఇవి తక్కువ ధరలో మంచి ప్రయోజనాలను అందిస్తాయి.
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌లు రూ .149, రూ .199 ల గురించి తెలుసు. కానీ ఇప్పుడు రూ. 130 లోపు వచ్చే రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల కింద యూజర్లు అపరిమిత కాల్స్ ను పొందడమే కాకుండా, డేటాను కూడా ఉపయోగించగలరు.
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు 28 రోజుల చెల్లుబాటుతో కేవలం రూ .129 కే అపరిమిత కాల్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ ప్లాన్ చెల్లుబాటు అయ్యే వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ కింద యూజర్లు మొత్తం 2 GB డేటాను పొందుతారు. వారు తమ అవసరానికి అనుగుణంగా దానిని ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా పరిమితి ముగిసిన తర్వాత వినియోగదారులు 64 Kbps వేగంతో ఇంటర్నెట్ వాడొచ్చు. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు 300 SMS లను పొందుతారు. అలాగే జియో కాంప్లిమెంటరీ యాప్‌లను ఉపయోగించవచ్చు.
ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్
టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌కు భారతదేశంలో చాలా మంచి యూజర్‌బేస్ ఉంది. ఎయిర్‌టెల్ కూడా రిలయన్స్ జియో మాదిరిగా రూ .129 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత కాల్స్ చేయగలరు. అలాగే ఇందులో 1 GB ఇంటర్నెట్ డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది . 24 రోజులు చెల్లుబాటు అవుతుంది. అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ట్రయల్‌తో సహా అనేక కాంప్లిమెంటరీ యాప్‌లకు మీరు యాక్సెస్ పొందొచ్చు. ఈ ప్లాన్‌లో 300 SMS అందుబాటులో ఉంటాయి.
వి రీఛార్జ్ ప్లాన్
వి ఎయిర్‌టెల్ కూడా జియో వంటి 129 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత కాల్స్ తో పాటు 300 sms అందుతాయి. కాంప్లిమెంటరీ యాప్స్ గురించి సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: