ఇకపై ఇంటర్నెట్ లేకుండానే డబ్బు బదిలీ చేయవచ్చు..!
ఇదంతా మన దగ్గర కేవలం ఇంటర్నెట్ ఉన్నంతవరకే డబ్బులు పంపించవచ్చు.. కానీ మన దగ్గర ఇంటర్ నెట్ అయిపోయింది అనుకోండి ..అత్యవసరంగా ఎవరికైనా డబ్బు మనం పంపించాలి.. ఆ సమయంలో ఏం చేయాలి.. అంతేకాదు ఏదైనా హోటల్ కి , రెస్టారెంట్ కి లేదా మరి ఎక్కడికైనా కంపెనీ లో ఉన్నప్పుడు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించాలనుకుంటే , మొబైల్లో ఒకవేళ నెట్ లేకపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు..
అయితే ఇప్పుడు నగదు బదిలీ కోసం ఇంటర్నెట్ లేకుండా సరే ఉచితంగా.. నిస్సందేహంగా డబ్బులు బదిలీ చేయవచ్చు అంటున్నారు.. అంతే కాదు మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా సరే డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చట.. అయితే ఇందుకోసం మీరు *99# డి కోడ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది అని సూచిస్తున్నారు నిపుణులు. ఇది ఇంటర్నెట్ లేకుండా డబ్బు ఎలా బదిలీ చేయాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ముందుగా మీ ఫోన్ లో డైల్ పాడ్ ఓపెన్ చేసి *99# అని నంబర్ ను టైప్ చేయగానే, 7 సరికొత్త ఎంపికల తో కూడిన ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.. ఇందులో మీరు డబ్బు పంపించడం లేదా డబ్బు స్వీకరించడం, చెక్ బ్యాలెన్స్ ,మై ప్రొఫైల్, పెండింగ్ అభ్యర్థనలు.. లావాదేవీలు.. యూపీఐ పిన్ వంటి ఆప్షన్లు మీకు కనిపిస్తాయి.
ఇక ఇప్పుడు డైల్ పాడ్ నెంబర్ పై ఒకటి నొక్కితే డబ్బులు పంపండి అనే ఎంపిక ఎంచుకోవచ్చు.. ఆ తర్వాత మీ ఖాతా నెంబర్ , ఐఎఫ్ఎస్సి కోడ్ ఉపయోగించి డబ్బు పంపించడానికి మిమ్మల్ని అనుమతి కోరుతుంది.. ఇక అలా ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి మీరు ఎంత డబ్బు పంపించాలి అనుకుంటున్నారో..అలా వివరాలన్నీ ఇచ్చి అని సెండ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు డబ్బు పంపాలనుకున్న వారికి చేరుతుంది.