రూ. 999 కే ఇయర్‌ బడ్స్... అద్భుతమైన ఫీచర్లు

Vimalatha
ఇటీవల కాలంలో ఫోన్లతో పని లేకుండా బ్లూ టూత్ ఇయర్‌ బడ్స్ వచ్చేశాయి. వీటి ద్వారా ఫోన్లను పట్టుకోకుండానే మాట్లాడొచ్చు. మాట్లాడుతూనే ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. తక్కువ ధరలో మంచి ఇయర్‌ఫోన్‌ల కోసం చూస్తున్నారా ? అయితే ఇది మీ కోసమే. Mivi ఇటీవల అద్భుతమైన ఇయర్‌ బడ్‌లను విడుదల చేసింది. DuoPods F30 పేరుతో Mivi బ్రాండ్ విడుదల చేసిన ఇయర్‌ బడ్స్ పలు రంగులలో లభిస్తాయి. అన్ని రకాల ఫీచర్లతో మంచి బ్యాటరీ లైఫ్ తో ఉన్న ఈ ఇయర్‌ బడ్స్ కు క్రేజ్ పెరుగుతోంది. ఈ ఇయర్‌బడ్‌ల ప్రత్యేకత ఏమిటో చూద్దాం.
 
DuoPods F30 ఛార్జింగ్, ఇంకా ప్రత్యేకతలు
Mivi ఇయర్‌బడ్‌లను పూర్తిగా ఛార్జ్ చేసి ఉపయోగిస్తే రెండు రోజుల పాటు అంటే 42 గంటల పాటు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పని చేస్తాయి. ఈ ఇయర్‌బడ్‌లు అద్భుతమైన టచ్ కంట్రోల్‌ తో వస్తాయి. టచ్ కంట్రోల్‌ మీ ఫోన్‌ని తాకకుండానే సులభంగా కాల్స్ అటెండ్ చేయడానికి, కట్ చేయడానికి, పాటలను మార్చడానికి, గూగుల్, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్‌లను యాక్టివేట్ చేయడానికి, సౌండ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఇయర్‌ ఫోన్‌ లు దుమ్ము, చెమట, వర్షం లేదా నీటి స్ప్లాష్ వల్ల డామేజ్ అవ్వవు. DuoPods F30 లోని ఇయర్‌బడ్‌కు మైక్రోఫోన్ అమర్చబడి ఉంటుంది. తద్వారా మీరు అదే ఇయర్‌ బడ్‌ను ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. 13 మిమీ డ్రైవర్‌లతో కూడిన ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.0 కి సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా ఆన్ మరియు ఆఫ్ చేస్తుంది.   ఈ ఇయర్‌ బడ్‌లను కొనాలనుకుంటే అవి ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ .999 కే అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం కావాలనుకున్న వాళ్ళు ఎంచక్కా ఈ ఇయర్ బడ్స్ కొనేయొచ్చు.  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: