రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ సూచన..!

MOHAN BABU
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం  మెల్లగా  వాయుగుండంగా మారి ఉత్తర వాయువ్య దిశగా కదిలి 13 తేదీన ఉదయం  4 గంటలకు ఉత్తర ఒరిస్సా రాష్ట్రంలోని  చాంద్ బలి అనే తీరాన్ని దాటింది. ఇది మళ్ళీ పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మెల్లిగా బలహీనపడే అవకాశం ఉన్నది. ఈ వాయుగుండం వలన ముందే అంచనా వేసినట్టు రెండు తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం ఎక్కువగా లేదు. దీని ప్రభావంతో  కొన్నిచోట్ల  మాత్రమే కురుస్తున్నటువంటి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు  ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర,  తూర్పుకృష్ణా జిల్లాల్లో మరొ 24 గంటల పాటు ఉంటుంది.


 దీంతోపాటుగా  తెలంగాణ  జిల్లాల్లో  మరొ 48 గంటల పాటు  కొనసాగి ఆ తర్వాత నుండి తగ్గే అవకాశం ఉన్నది.
ఇదే సమయంలో మిగిలిన తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ, జిల్లాలలో ఆకాశం పాక్షికంగా  గంటకు 46-55 కిలోమీటర్ల  వేగంతో గాలులు వీస్తాయి.
ప్రస్తుతం ఏర్పడినటువంటి వాయుగుండం ముప్పు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా తప్పిపోయినట్టే. కాబట్టి సామాజిక  మాధ్యమాలలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు.  18వ తేదీ వరకు ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఇంకొక  బలహీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క అల్పపీడనం  ఒరిస్సా వైపుకు కదిలే అవకాశముంది. కాబట్టి ఈ యొక్క అల్పపీడనం కూడా రెండు తెలుగు రాష్ట్రాలపై  పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు.

 గ్లోబల్ మోడల్స్  ప్రకారం ఈ ఏడాది కూడా అక్టోబర్, మరియు నవంబర్, డిసెంబర్ లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈశాన్య రుతుపవనాల వలన కురిసే టువంటి వర్షం  గత రెండేళ్ల  సాధారణం కంటే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది.  అలాగే ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలు  ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటుగా మిగిలినటువంటి కోస్తాంధ్ర జిల్లాల కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరిలో అధికంగా  వర్షాలు ఉండే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: