మోస్ట్ వాంటెడ్ ఫోన్ లు రిలీజ్ అయ్యేది ఈ వారంలోనే?

VAMSI
టెక్నాలజీ రంగం రోజు రోజుకీ ఎంతో అభివృద్ధి చెందుతూ మనిషికి ఏది ఉన్నా లేకున్నా మొబైల్ అనేది చాలా అత్యవసరమైన వస్తువుగా మారిపోయింది. కాబట్టి ఈ మొబైల్ సేల్స్ కూడా ఎప్పటికీ తగ్గవు. మంచి క్వాలిటీ మరియు స్పెసిఫికేషన్స్ కలిగిన మొబైల్స్ కు మంచి మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఉన్న అన్ని మొబైల్ కంపెనీలు ఒకరితో ఒకరు పోటీపడి ఉత్తమమైన ఫోన్ లను అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. అదే విధంగా ఈ వారం కొన్ని మొబైల్స్ మార్కెట్ లో విడుదల కానున్నాయి. మరి మీరు ఫోన్ కొనాలి అనుకుంటే వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి.
ఎన్నో రోజులుగా ఆపిల్ ఐఫోన్ 13 కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఫోన్ కు సంబంధించిన అధికారిక ఫీచర్స్ గురించి ఏమీ తెలియదు. గత కొద్ది రోజుల నుండి ఆపిల్ ఫోన్ 13 గురించి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. వాటిని బట్టి ఈ ఫోన్ లో వీడియో పోర్ట్రైట్ మోడ్ ప్రత్యేకంగా ఉండనుంది. దీని యొక్క ఉపయోగం ఏమిటంటే మనము వీడియో రికార్డింగ్ చేసే సమయంలో ఈ ఫీచర్ ను ఉపయోగించి బ్యాక్ గ్రౌండ్ ను బ్లర్ చేయవచ్చు. అంతే కాకుండా ఈ మోడల్ ఫోన్ లో వీడియో చాలా హై క్వాలిటీతో వస్తుందని తెలుస్తోంది.  ముఖ్యంగా ఫోటోలు తీసిన తరువాత వాటిని వివిధ రకాలుగా ఫిల్టర్ చేసే సౌకర్యం ఉండనుంది. ఇందులో లుక్, కలర్స్ ను మార్చుకోవచ్చు. ఐఫోన్ 13 లో మొత్తం 4 సబ్ మోడల్స్ ను అందుబాటులోకి తీసుకు రానుంది. వాటిలో ఐఫోన్ 13, ఐఫోన్ 13 మిని, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్. దీనికి సవందించిన ఫంక్షన్ ఇంకో రేపు జరగనుంది. అదే సమయంలో ఆపిల్ వాచ్ 7, ఐపాడ్ మినీ మరియు ఆర్ పాడ్స్ ను కూడా లాంచ్ చేయనున్నారు.
ప్రస్తుతం ఉన్న మొబైల్ రంగంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న కంపెనీలలో షావోమి కూడా ఒకటి. ఈ కంపెనీ నుండి కూడా సెప్టెంబర్ 15 న షావోమి నుండి 11టీ సీరీస్ ను లాంచ్ చేయనున్నారు. మామూలుగా అంతకు ముందు విడుదల చేసిన సీరీస్  షావోమి ఎంఐ 11 అనే పేరుతో వచ్చింది. ఇప్పుడు దానికి బదులుగా షావోమి 11 టీ అనే పేరును మార్చనున్నారు. దీని ఫీచర్స్ ఇంకా విడుదల కావాల్సి ఉంది. హువాయి కంపెనీ కూడా కొత్త మొబైల్ ను రిలీజ్ చేయడానికి ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయనుంది. ఇందులో హువాయి నుండి లాప్టాప్ లు మరియు ఇతర లాప్టాప్ పరికరాలను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. మరి వీటిలో ఏవి క్లిక్ అవుతాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: