జీమెయిల్ అకౌంట్ కి ఫుల్ సెక్యూరిటీ ఎలా...?

Sahithya
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ హ్యాకర్లు కూడా తమ పంథా ను క్రమంగా మారుస్తూ వస్తున్నారు. గోప్యత విషయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. మన సమాచారం ఆన్లైన్ లో భద్రంగా ఉన్నట్టా కాదా అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న పాయింట్. దాదాపు ప్రతిఒక్కరికీ గూగుల్ అకౌంట్ ఉంది. చాలా మందికి తమ అకౌంట్ మీద అనేక అనుమానాలు ఉన్నాయి. హ్యాకర్ల చేతిలో నా అకౌంట్ సేఫ్ గానే ఉందా అనే అనుమానం చాలా మందిలో వ్యక్తమవుతూ ఉంటుంది.
ప్రతిరోజూ కొత్త సైబర్ నేరాలు బయటకు వస్తూనే ఉంటారు. గూగల్ అకౌంట్  నుంచి మనం చాలా యాప్స్ కి లాగిన్ అవుతూ ఉంటాం. అందుకే మన గూగుల్ అకౌంట్ సేఫ్ కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత డేటా, చిత్రాలు, వీడియోలు మరియు ఫైల్‌లకు సంబంధించి మీ గూగుల్ అకౌంట్ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం మీ గూగుల్ అకౌంట్ కి పాస్వార్డ్ ఉన్నా సరే దాన్ని హ్యాక్ చేస్తున్నారు. అక్కడి వరకు ఆగకుండా 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఉపయోగిస్తే మంచిది అనే అభిప్రాయం ఉంది.
మీ అకౌంట్ లోకి లాగిన్ చేయడం కాస్త భిన్నంగా ఉంటుంది. లాగిన్ చేసే ముందు మీరు పాస్వార్డ్ ని ఎంటర్ చేస్తారు. మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటే... ఆ తర్వాత మరిన్ని వివరాల కోసం గూగుల్ మిమ్మల్ని అడుగుతుంది. మొబైల్ యాప్ ద్వారా మీ ఫోన్‌కు ఒక కోడ్ వెళ్తుంది. లేదా ఈ మెయిల్ కి వెళ్తుంది. ఇక మీ దగ్గర సెక్యూరిటీ కీ ఉంటె దాన్ని ఒక పెన్ డ్రైవ్ లో కూడా సేవ చేసుకుని లాగిన్ సమయంలో ఉపయోగించవచ్చు. హ్యాకర్లు మీ పాస్వార్డ్ తెలుసుకున్నా సరే యాక్సెస్ చేయాలి అంటే వారికి మీ ఫోన్ లేదా సెక్యూరిటీ కీ అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: