బుల్లిపిట్ట: మొబైల్ కొనేముందు ఇలా చెక్ చేస్తే మంచిది..!

Divya
మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఎక్కువగా అందరూ వాడుతూనే ఉన్నారు . ఇక రాను రాను ప్రతిరోజు టెక్నాలజీ పెరుగుతూనే వస్తోంది. అందుచేతనే కొంతమంది కొత్త మొబైల్ ను సగం ధరకే అమ్ముతూ ఉంటారు. వాటిని మనం తక్కువ ధరకే కొనే వీలుంటుంది. కానీ తక్కువ ధరలకే మన మొబైల్ తీసుకున్నప్పుడు చెకింగ్ చేయకుండా తీసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుచేతనే మీరు మొబైల్ కొనేటప్పుడు ఇలాంటివి కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

1).మొబైల్స్ ని ఎవరైనా దొంగలించిన, పోగొట్టుకున్న తరువాత ఆ మొబైల్ ను ట్రాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. అదే"DOT"అనే ఒక పోర్టల్ ని కనిపెట్టింది.

2). ఈ పోర్టల్ ని టెలీ కమ్యూనికేషన్ (DOT) తో లింక్ అయి ఉంటుంది .అందుచేతనే మొబైల్ ని ఎవరైనా దొంగలించిన, పోగొట్టుకున్న ఆ మొబైల్ యొక్క IEMI నెంబర్ ద్వారా మొబైల్ ఫోన్ ఒరిజినల్ ఓనర్ దా,  కొట్టుకొచ్చినదా అని తెలుసుకోవచ్చు.

ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం:

1). ముందుగా CEIR అనే పోర్టల్ ను ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇక ఆ తర్వాత అక్కడ వున్న మెయిన్ పేజీలో అప్లికేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయాలి.

2). ఆ తర్వాత అక్కడ know your mobile App ,IMEI వెరిఫికేషన్  వంటివి రెండూ కనిపిస్తాయి. అందులో IEMI అనే ఆప్షన్ ని తీసుకోండి.

3). అక్కడ మొబైల్ నెంబర్ ను టైప్ చేయవలసి వుంటుంది. ఆ తర్వాత ఓటిపి నెంబర్ ను ఎంటర్ చేయాలి .

4). అదేవిధంగా IEMI కోసం చూపిస్తున్న బాక్సులో ఇమేజ్ కాప్చాను ఎంటర్ చేయవలసి ఉంటుంది.

5) చివరిసారిగా మీరు తీసుకున్నటువంటి  IMEI నెంబర్ ను  అక్కడ చూపిస్తున్నటువంటి కింద బాక్స్ లో ఎంటర్ చేసి , ఆ తర్వాత ఓకే చేయాలి. ఆ తర్వాత అక్కడ మీకు వివరాలను చూపిస్తుంది.

ఒకవేళ మీకు IEMI నెంబర్ తెలియకపోతే..*#06# టైప్ చేయడం వల్ల  కూడా తెలుసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: