బుల్లి పిట్ట: టీవీలో వీడియో కాలింగ్ చేయడం ఎలానో తెలుసా..?

Divya
టీవీలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే టెక్నాలజీని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ.. వినియోగదారులకు కావాల్సిన సరికొత్త టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇప్పుడు సరికొత్తగా వినూత్నమైన ఆలోచనతో జియో ఫైబర్ మనం ఎందుకు వచ్చింది. అదేమిటంటే, ఇకపై జియో వినియోగదారుల కూడా సరికొత్తగా టీవీ లో కూడా ఇకపై వీడియో కాలింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించబడింది. ఇక ఇందుకోసం ఎలాంటి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు..
జియో ఫైబర్ సరికొత్తగా "కెమెరా ఆన్ మొబైల్" అనే ఒక సరికొత్త ఫీచర్లతో జియో యూజర్లకు ..టీవీ లో కూడా వీడియో కాలింగ్ చేసుకునే అవకాశాన్ని పొందుపరిచింది. ఒక ప్రత్యేకమైన ఆప్షన్ ను రూపొందించడం వల్ల ఇకపై సులభంగా టీవీ లో కూడా మనం వీడియో కాల్ చేసుకోవచ్చు. ముందుగా టీవీల ద్వారా వీడియో కాలింగ్ చేయాలి అనుకుంటే, జియో  జాయిన్ అనే ఒక యాప్ ను మీరు మీ టీవీ లో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ముందుగా మీరు మీ మొబైల్ కు ఉన్న కెమెరా ద్వారా టీవీ లో వీడియో కాల్ చేయడానికి, పది అంకెల నెంబర్ కలిగిన జియో ఫైబర్ నంబర్ ను.. జియో జాయిన్ అనే యాప్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత జియో జాయిన్ అనే యాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి , కెమెరా ఆన్ మొబైల్ అనే ఫీచర్ ద్వారా వీడియో కాలింగ్ చేయవచ్చు. ప్రస్తుతం 2.4 జిహెచ్జెడ్ సామర్థ్యంతో వీడియో కాల్ చేసుకొని అవకాశం కల్పించినప్పటికీ, వీడియో క్లారిటీ కావాలంటే మాత్రం 5 జి హెచ్ జెడ్ వై ఫై మోడ్ కి మారాల్సి ఉంటుంది. అంటే మీరు మీకు వచ్చే జియో ఫైబర్ మోడెమ్ ను మార్చుకుంటే సరిపోతుంది. అంతేకాదు ల్యాండ్ లైన్ వంటి ఫోన్లో కూడా మీరు ఈ జియో జాయిన్  యాప్ ద్వారా వాయిస్ కాలింగ్ చేసుకునే అవకాశం కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: