బుల్లిపిట్ట: మొబైల్స్, ల్యాప్ టాప్స్ కు ఫుల్ ఛార్జింగ్ పెడితే అంతే..
మనము వాడేటువంటి మొబైల్స్, ల్యాప్టాప్లకు ఎప్పుడూ ఛార్జింగ్ ఉండేలా కనెక్ట్ చేసి ఉంటాము. అయితే వీటికి ఫుల్ చార్జింగ్ చేయడం వల్ల ఒక సమస్య వచ్చి పడుతోంది. అది ఏమిటంటే, బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందట. దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. అలా ఎందుకు జరుగుతోందో తెలుసుకుందాం.
మనము ఎలక్ట్రానిక్ కనెక్టింగ్ బ్యాటరీ లలో ఎక్కువగా చూసుకుంటే , అందులో లిథియం ఐయాన్ ఎక్కువగా ఉండే బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీలను సంవత్సరానికి, మనం ఎన్నిసార్లు 100 % ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ లైఫ్ అంత శాతం తగ్గుతూ వస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల మన బ్యాటరీ సామర్థ్యం దినానికి తగ్గుతూ వస్తుంది. అయితే ఇలా కాకుండా ఉండాలంటే.. ఇలా చేస్తే చాలు..
మనం మొబైల్స్ గానీ, లాప్టాప్స్ గానీ ఛార్జింగ్ చేసేటప్పుడు వాటికి 100 % ఛార్జింగ్ ఉండకోకుండా ఉండేవిధంగా ఛార్జింగ్ చేయాలి. బ్యాటరీ లైఫ్ తగ్గకుండా ఉండాలంటే 25% కన్న తక్కువ ఉంటే ఛార్జింగ్ పెట్టాలి,85% ఎక్కువగా ఉంటే ఆపివేయాలి. అని నిపుణులు సూచిస్తున్నారు. 100% ఛార్జింగ్ అయిందంటే 100-1 % తగ్గినట్లే. అంటే 99 % కి బ్యాటరీ లైఫ్ పడిపోయినట్లు.
ఇక అలాగని పూర్తిగా battery low అయ్యేంతవరకు ఉండకూడదు. 85% ఛార్జింగ్ అవ్వగానే తీసేస్తే బ్యాటరీ లైఫ్ ఎక్కువ రోజులు వస్తుందట. ఇక అంతే కాకుండా రాత్రివేళలో మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి పడుకోకూడదు. అది చాలా ప్రమాదం అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.మీరు కూడా ఇలా చేస్తుంటే మానేయండి.