బుల్లిపిట్ట : BSNL సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే..
బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కస్టమర్లను రాబట్టుకోవడం కోసం బిఎస్ఎన్ఎల్ ఎన్నో సరికొత్త ప్లాన్ లను, అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తోంది. అయితే ఇప్పుడు కూడా వున్న ప్లాన్స్ పై సరికొత్త బెనిఫిట్స్ ను కూడా అందిస్తోంది.
ఇప్పుడు సరికొత్తగా బిఎస్ఎన్ఎల్ 75 రూపాయల విలువ గల స్పెషల్ ఆఫర్ ను విడుదల చేసింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే, 2 జీబీ డేటా లభించడంతోపాటు 60 రోజులు వ్యాలిడిటీ కూడా ఉంటుంది. అంతే కాదు 100 నిమిషాలు కాల్స్ మాట్లాడుకోవడంతో పాటు 60 రోజుల పాటు నేషనల్ రోమింగ్ కూడా ఉచితం. బిఎస్ఎన్ఎల్ అందించే, డిఫాల్ట్ ట్యూన్ ను కూడా ఉచితంగా పొందవచ్చు.
ఇక 94 రూపాయలతో అందించే మరొక రీఛార్జ్ చేయడం వల్ల 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 3జీ డేటా అలాగే 100 నిమిషాలు కాల్స్ 60 రోజుల డిఫాల్ట్ ఉచితం.
ఇక మరొక ప్లాన్ రూ. 699.. ఇది ప్రమోషనల్ ప్లాన్ వాలిడిటీ గా మార్చబడింది. ఈ ప్లాన్ పై ప్రతిరోజు 0.5 జీ బీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. 180 రోజులు వ్యాలిడిటీ ఉన్నా, 60 రోజుల పాటు డిఫాల్ట్ ట్యూన్స్ ని ఉచితంగా పొందొచ్చు.
అయితే ముందుగా ఈ ప్లాన్ ను యాక్టివేట్ చేసుకునే ముందు మీ అకౌంట్ బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకొని, రూ. 699 కన్నా ఎక్కువగా ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఉంటేనే ఈ ప్లాన్ ఆక్టివేట్ అవుతుంది.
మరొక రూ.499 గల ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని రీఛార్జ్ చేసుకుంటే 2 జిబి డేటా లభించడంతోపాటు 90 రోజులు అన్ లిమిటెడ్ కాల్స్ కూడా పొందవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితం.
అయితే మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతటి మంచి ఆఫర్ లను బిఎస్ఎన్ఎల్ అందిస్తోంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.