బుల్లి పిట్ట : ఈ టెక్నాలజీతో ఆ దేశంలో సోల్జర్స్ మరణించే అవకాశమే లేదు..

Divya

ప్రతి దేశంలోని ప్రజలు క్షేమంగా జీవిస్తున్నారు అంటే, అందుకు సైనికులే ముఖ్య కారణం అని చెప్పవచ్చు. సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం సరిహద్దుల్లో శత్రు రాజ్యాల నుంచి తమ దేశాన్ని కాపాడుతూ, దేశ శ్రేయస్సు కోసం పాటు పడుతున్నారు. ఇతర దేశాల శత్రువులతో యుద్ధం చేస్తూ ఎంతో మంది సైనికులు ప్రాణాలను వదులుతున్నారు. సైనికులు దేశానికి వెన్నెముక లాంటి వారు..వారు తమ కుటుంబాలను సైతం వదిలి వచ్చి, దేశంలో నివసించే ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తూ వుంటారు.
అందుకోసమే ఆయా దేశాల ప్రభుత్వాల వారు.. ఈ సైనికులకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చడం తో పాటు వారి కుటుంబాలకు కూడా ఎన్నో విధాలుగా సహాయ పడుతూ ఉంటారు. ఇదిలాఉండగా సాధారణంగా యుద్ధం చేయాలి అంటే సైనికులు, శత్రువులతో పోరాడాల్సి ఉంటుంది. కానీ ఆ దేశంలో మాత్రం సైనికులు ఉంటారు.. కానీ  శత్రువులకు కనిపించకుండా వారిని హతమార్చుతారట. ఇంతకు ఆ దేశం ఏమిటి..?ఆ దేశంలో ప్రవేశపెట్టిన టెక్నాలజీ ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఆ దేశం ఏదో కాదు ఇజ్రాయిల్ దేశం. ఈ దేశం సైనికుల కోసం వినూత్న మైనా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టెక్నాలజీ ద్వారా సైనికులు శత్రువులకు కనిపించరు.. వీరు ఈ పద్ధతి కోసం ఏర్పాటుచేసిన టెక్నాలజీ ఏమిటంటే, కామెఫ్లాగ్ షీట్ పేరు మీద కిట్ 300 ఏర్పాటు చేశారు. ఇక దీనిని ఆ దేశ  రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి పొలారిస్ సొల్యూషన్స్ అనే సంస్థ వారు ఏర్పాటు చేయడం  జరిగింది. ఇక ఈ షీట్ గనుక ధరిస్తే శత్రువులకు అంత సులభంగా సైనికులు కనిపించరట. ఎందుకంటే ఈ షీటును థర్మల్ తో రూపొందించారు. ఇక దీనిని తయారు చేసేటప్పుడు మెటల్స్ , మైక్రో ఫైబర్స్,  పాలిమర్స్ ను ఉపయోగించారు..

ఒక్కసారి ఈ షీట్ ని ధరిస్తే, ఇక మామూలుగా చూసినా, థర్మల్ కెమెరాల ద్వారా చూసినా కూడా ఈ షీట్  ధరించిన వ్యక్తి ఎక్కడున్నారో కనిపించడం అసాధ్యం. ఈ షీట్ ధరించినపుడు ఒకవైపు పెద్ద బండరాళ్ల లాగా కనిపిస్తుంది . మరొకవైపు పచ్చని రంగులు పంటపొలాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ..కొండల్లో యుద్ధం చేసేటప్పుడు బయటకి రాతి రంగు కనిపించేలా ఒంటికి చుట్టుకోవాలి. ఇక అదే అడవుల్లో యుద్ధం చేసేటప్పుడు పచ్చని రంగు బయటకు  ఉండేలా చుట్టుకోవాలి.. తద్వారా శత్రువులు సైనికులను గుర్తుపట్టడం కష్టమవుతుంది. వీటిని ధరించినప్పుడు 1.1 పౌండ్లు బరువు మాత్రమే ఉంటుంది. ఇది సులభమైన పద్ధతి శత్రువులను జయించడానికి సరైన మార్గం అని అంటున్నారు ఇజ్రాయిల్ దేశస్తులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: