ల్యాప్‌ టాప్ ఛార్జర్ లో దీని ఉపయోగమేమిటో తెలుసా ?

VAMSI
మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీ లో అనేక మార్పులు వస్తున్నాయి. మనము వాడే ఎలక్ట్రానిక్ పరికరాల డిజైన్ మరియు వాటిలో ఉపయోగించే సహా పరికరాలలో చాలా తేడా గమనించవచ్చు. ఈ పరికరాలలో కొన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి ఉంటాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా మనము ఆయా వస్తువులను వాడుతూ ఉంటాము. కానీ ఆ పరికరాలు అక్కడే ఎందుకు అమర్చారు ? అవి ఏ విధంగా పనిచేస్తాయి అని ఎప్పుడూ ఆలోచించము. అలాంటి ఒక తెలియని పరికరం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. నేటి సమాజంలో చదువుకునే విద్యార్థుల దగ్గర నుండి చిన్న చిన్న వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారాలు వరకు అందరి దగ్గర లాప్ టాప్ లు ఉంటున్నాయి. ఈ లాప్ టాప్ కు కంపెనీ వారు చార్జర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ చార్జర్ కేబుల్ మధ్య భాగంలో ఒక సిలిండర్ ఆకారంలో ఒక పరికరం అమర్చబడి ఉంటుంది.

ఇలాంటిది కేవలం లాప్ టాప్ లోనే కాకుండా, మౌస్, కీ బోర్డు మరియు ఇతర కేబుల్స్ లోనూ అమర్చబడి ఉంటాయి. ఇది ఎందుకు అమర్చారు దీని వలన ఉపయోగం ఏమిటో మీకు తెలుసా ? ఇలా సిలిండర్ ఆకారం లాగా ఉండే దానిని ఫెర్రైట్ పూస లేదా చౌక్ అని అంటూ ఉంటారు. ఈ సిలిండర్ ను మీరు విప్పినప్పటికీ ఇందులో వైర్ల వ్యవస్థ ఏమీ ఉండదు. ఇది ఒక విద్యుదయస్కాంతము. ఇది తనలోని అయస్కాంత గుణాన్ని చూపించి ఇది కేబుల్ డామేజ్ అవకుండా కాపాడడంలో ఉపయోగపడుతుంది. మనకు ఎలక్ట్రో మాగ్నెటిక్ ఇంటర్ఫేరెన్సు గురించి తెలిసే ఉంటుంది. ఒక కేబుల్ ఉంది అంటే, దాని నుండి ఎంతోకొంత విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. మనము వాడే లాప్ టాప్ లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేసే సమయంలో కొన్ని రకాల పౌనఃపున్యాలు మరియు తరంగాలు వెలువడడం సహజమే.

ఇలాంటి తరంగాల వలన మీ ఎలక్ట్రానిక్ పరికరం పాడయ్యే అవకాశం ఉంది. కానీ వీరు ఛార్జింగ్ కేబుల్ లో ఐరన్ ఆక్సైడ్ తో తయారు చేసిన సిలిండర్ ఆకారంలో ఉన్న ఫెర్రైట్ పూసను అమర్చడం వలన ఇది ఒక చౌక్ లాగా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇలా ఏర్పడే రేడియో ఫ్రీక్వెన్సీలను కూడా పరికరం లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఒకవేళ ఈ సిలిండర్ లేకపోతే దీని నుండి వెలువడే తరంగాలు మరియు పౌనఃపున్యాల కారణంగా మీరు కనెక్ట్ చేయబడిన పరికరం నాశనమవుతుంది. ఇప్పుడు మీకు అర్ధమయింది కదా చార్జర్ కేబుల్ లో ఈ సిలిండర్ ఆకారంలో పూసను ఎందుకు అమర్చుతారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: