బుల్లిపిట్ట : గ్యాస్ సిలిండర్ కావాలంటే, ఆ నెంబర్ చెప్పాల్సిందే..!

Divya

దేశంలో ఎక్కడ చూసినా అన్ని విషయాలలోనూ మార్కెట్ దందాలు జరుగుతున్న విషయం, ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎవరూ పట్టించుకోరు అంతే.. ఇదే తరహాలో గ్యాస్ కంపెనీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ , మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల దందాలు జరుగుతూనే ఉన్నాయి. గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను కాస్త, పక్కదోవ పట్టించి, సొమ్ముచేసుకుంటున్నారు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు. ఆయా గ్యాస్ కంపెనీలు ఎన్ని రకాల టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకొచ్చినా, వాటిని ఉపయోగించుకుంటున్నా  ఎలాంటి లాభం లేకపోయింది. కొత్త కొత్త విధానాలను తీసుకొస్తున్నప్పటికీ , కేటుగాళ్లు మాత్రం కొత్త కొత్త రూపాల్లో, వారి తెలివిని అంతా ఉపయోగించి, వాటిని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు..


అయితే ఇటీవల ఇండేన్ గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టదానికి ,డ్యాక్ సర్వీసులను తీసుకొచ్చింది ఇండియన్ గ్యాస్ కంపెనీ.  డ్యాక్ అంటే డెలివరీ అథెంటికేషన్ కోడ్ అని అర్థం. గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన ప్రతిసారి ఈ డ్యాక్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నంబర్ వినియోగదారుల ఫోన్ కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది.. ఎవరైతే మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడానికి వస్తారో,  ఆ బాయ్ కు  ఈ కోడ్ చెప్పాల్సి ఉంటుంది..


ఇక ఈ కోడ్ నెంబర్ చెప్పిన తర్వాతనే డెలివరీ ప్రక్రియ పూర్తవుతుంది.. ఈ నేపథ్యంలోనే ఇండేన్  గ్యాస్ తన వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. అదేమిటంటే , ఇండేన్ గ్యాస్ బుక్ చేసిన ప్రతిసారీ  డ్యాక్ నెంబర్ జనరేట్ అవుతుందని తెలిసింది. ఈ నెంబర్ డెలివరీ బాయ్ కు  చెప్పిన తర్వాతనే మీ డెలివరీ పూర్తవుతుందని కూడా స్పష్టం చేసింది ఇండియన్ గ్యాస్ కంపెనీ.



ఇక ఇందుకు తగ్గట్టుగానే వినియోగదారులు కూడా ఈ సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని , వినియోగదారులను కోరింది ఇండియన్ గ్యాస్ కంపెనీ. అలా  వినియోగించుకోని యెడల  మీ గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ అవ్వదు అన్న విషయాలను కూడా గుర్తించుకోవాలని హెచ్చరించింది. ఇక ఈ విషయాలన్నింటినీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వినియోగదారులకు తెలియజేసింది ఇండేన్ గ్యాస్ కంపెనీ..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: