శాంసంగ్ గెలాక్సీ ఫోన్ల పై భారీ తగ్గింపు.. ఎంతంటే?

Satvika
టాప్ మొబైల్ కంపెనీలలో ఒకటి శాంసంగ్.. గతేడాది మనదేశంలో గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన మొట్టమొదటి శాంసంగ్ ఫోన్ అదే. ఇప్పుడు దీనిపై రూ.2,000 తగ్గింపు అందించారు. ఈ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 64 మెగా పిక్సెల్ కెమెరా ను కూడా అందించింది.

ఈ కంపెనీ నుంచి వచ్చిన వాటిలో రెండు వేరియంట్ల లో లభిస్తున్నాయి..6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 నుంచి రూ.22,999కు తగ్గించారు. అలాగే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కూడా రూ.26,999 నుంచి రూ.24,999కు తగ్గింది. ఎలక్ట్రిక్ బ్లూ, సెలెస్టియల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1500 డిస్కౌంట్ లభించనుంది.మొత్తంగా చూసుకుంటే దాదాపు నాలుగు వేలు తగ్గుతాయి..

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్ ను అందించారు. దీంతోపాటు 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లు కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది.ఇందులో 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని శాంసంగ్ అందించడం విశేషం. 25W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 115 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని కంపెనీ వెల్లడించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: