బుల్లిపిట్ట : నెంబర్ ప్లేట్ రంగులకు అర్థం తెలుసా..?
మన తెలుగు రాష్ట్రాలలో ఉపయోగించే వాహనాలకు నెంబర్ ప్లేట్ లు ఏ రంగులో ఉంటాయి..? తెలుపు, పసుపు కలర్ మాత్రమే కనిపిస్తాయి. ఆ కలర్స్ పై నలుపురంగులో నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. ఈ రంగు లే కాకుండా కొన్నిసార్లు గ్రీన్, బ్లూ, రెడ్ నెంబర్ ప్లేట్ కూడా కనిపిస్తుంటాయి. అయితే ఏ కలర్ నెంబర్ ప్లేట్ ఏ వాహానానికి వాడతారో. వాటికి సంకేతం ఏంటో తెలుసుకుందాం. అంతేకాకుండా మిలటరీ వాహనాలకు వేరువేరు నెంబర్ ప్లేట్ లను కేటాయిస్తారు. వాహనాన్ని బట్టి నెంబర్ ప్లేట్లు జారీ చేస్తుంటారు అధికారులు. ఏ కలర్ నెంబర్ ప్లేట్లు ఏ వాహనానికి ఎలా ఇస్తారో..ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
1).వైట్ ప్లేట్ మీద బ్లాక్ లెటర్స్ :
రెగ్యులర్ గా మనం చూసే వాహనాలకు వైట్ ప్లేట్ బ్లాక్ లెటర్స్ మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ లేదా నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వీటిని వాడతారు.
2). పసుపు నెంబర్ ప్లేట్:
పసుపు నెంబర్ ప్లేట్ మీద నల్లటి అక్షరాలు కమర్షియల్ వాహనాలు కి సెట్ అవుతాయి. వస్తువుల రవాణాకు, ప్యాసింజర్ల కోసం వాడుతారు. ఓలా క్యాబ్ వంటి వాహనాల కిందికి వస్తాయి.
3). గ్రీన్ నెంబర్ ప్లేట్ :
ఇవి చాలా కొత్తగా కనిపిస్తున్న నెంబర్ ప్లేట్లు. దీనిని బట్టి ఆ వాహనం ఎలక్ట్రిక్ వాహనం అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లీగల్ గా తిరిగే ఎలక్ట్రానిక్ కార్స్ కు, ఎలక్ట్రానిక్ కమర్షియల్ వాహనాలకు ఇవి అమరుస్తారు.
4). బ్లూ నెంబర్ ప్లేట్ :
విదేశీ డిప్లోమేట్స్ వాడే వాహనాలకు బ్లూ నెంబర్ ప్లేట్ ఉంటుంది. వీరికి రాష్ట్రానికి సంబంధించిన కోడ్ కు బదులు దేశానికి రిప్రజెంట్ చేసే కోడ్ ఉంటుంది.
5). బాణం గుర్తులతో కలిగిన నెంబర్ ప్లేట్ :
న్యూ ఢిల్లీ లో ఉండే రిజిస్టర్ మిలటరీ వాహనాలకు ఈ నెంబర్ ప్లేట్ ఉంటుంది. అంతేకాకుండా ముందు లేదా రెండో అక్షరం ఉండే స్థానం లో బాణం గుర్తు ఉంటుంది.ఆ కోడ్ లో ఒక డిజిటల్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది.
6). రెడ్ నెంబర్ ప్లేట్ :
రెడ్ ప్లేట్ మీద తెల్లని అక్షరాలతో ఉన్న ప్లేట్ ను టెంపరరీ రిజిస్ట్రేషన్ కింద వాడతారు. R D O నుంచి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ పొందే అంతవరకు అది తప్పదు. ఇది ఒక నెల వ్యాలిడిటీతో మాత్రమే ఉంటుంది. ఈ నిబంధన ఆయా రాష్ట్రాల నిబంధలను సంబంధించి ఉంటుంది.