మోటో లో వచ్చే ఏడాది లాంఛ్ కానున్న ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇవే..

Satvika
మొబైల్ కంపెనీలలో మోటో కు ప్రత్యేక స్థానం ఉంది..ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్ల లో కొత్త గా వస్తున్న ఫోన్ లకు అందిస్తున్న ఫీచర్లు మాత్రం మాములుగా లేవు. సరికొత్త టెక్నాలజీ తో తయారు చేసిన ఫోన్లు యువతను ఆకట్టుకుంటున్నాయి.. ప్రస్తుతం మోటో జి ఫోన్ మార్కెట్లోకి రానుంది.మోటో జీ ప్లే స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో కనిపించింది. ఇందులో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు కనిపించాయి. అలాగే ఫోన్ ఫొటోలు కూడా లీకయ్యాయి. అంతేకాదు ఫోన్ ఫోటోలు కూడా ఆన్ లైన్ లో దర్శనం ఇస్తున్నాయి.



ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్‌ను అందించనున్నారు. సెల్ఫీ కెమెరా కోసం నాచ్‌ను ఇందులో అందించారు. ఈ ఫోన్ గతంలోనే గీక్ బెంచ్ వెబ్ సైట్లో కనిపించింది. అందులో కూడా క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్‌తోనే ఈ ఫోన్ లాంఛ్ కానుంది.ఇందులో ప్రాసెసర్ మోడల్ నంబర్ SM4350గా ఉన్నాయి. గతంలో వచ్చిన ఫోన్ల కంటే ఇప్పుడు రానున్న ఫోన్ మార్కెట్ మంచి డిమాండ్ ను అందుకుంటుందని మోటో కంపెనీ వెల్లడించింది. 



3 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ కనిపించింది. మరి ఇందులో ఎక్కువ ర్యామ్ ఉండే వేరియంట్ ఉందో లేదో తెలియరాలేదు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించనున్నారు.కెమెరా గురించి మాత్రం ఆన్ లైన్ లో కనిపించలేదు.మోటో అంటే కెమెరా సామర్థ్యం కూడా బాగానే ఉంటుందని యువత అభిప్రాయ పడుతున్నారు..ఫోన్ అంచులు కాస్త మందంగా ఉన్నాయి. పవర్, వాల్యూమ్ బటన్లు ఇందులో ఉండనున్నాయి. నవంబర్ లో మార్కెట్ లోకి విడుదల అయిన మోటో జీ ప్లే గీక్ బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్‌లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 3 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉంది. దీని ప్రకారం ఈ ఫోన్ సింగిల్ కోర్ టెస్టులో 253 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 1,233 పాయింట్లను సాధించింది.ఈ ఫోన్ స్పెసిఫికేషన్ లు లీక్ అయ్యాయి.ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొదట్లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని సమాచారం... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: