అదిరిపోయే ఫీచర్లతో విడుదలకానున్న సాంసంగ్ గెలాక్సీ F41
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 41 గా కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కానుందని... అది చూడడానికి అచ్చం సాంసంగ్ గెలాక్సీ ఎం, గెలాక్సీ ఎ ఫోన్ల మాదిరిగానే ఉందని తెలుస్తోంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 41 ముందు భాగంలో స్క్రీన్ పై వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుందని సమాచారం. ఫోన్ యొక్క వెనుక భాగంలో మూడు కెమెరాల సెటప్ ఉందని... ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వెనకవైపే ఉందని లీకుల ప్రకారం తెలుస్తోంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఇవ్వబడుతుంది. సో, గెలాక్సీ ఎఫ్41 మొబైల్ ఫోన్ కు వైర్డ్(wired) ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేసి సంగీతం వినవచ్చు. అలాగే డ్యూయల్ స్పీకర్ సెటప్ కూడా ఈ ఫోన్లో లభించనుందని జీఎస్ఎంఏరిన వెబ్సైట్ నివేదించింది.
విశ్వసనీయ వర్గాల ప్రకారం గెలాక్సీ ఎఫ్41 లో వెనుక భాగంలో 64 మెగాఫిక్సల్ కెమెరా ఉందని, యుఎస్బీ టైపు సీ పోర్ట్ కూడా పొందని తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ ఫోన్ లో ఇంతకుముందు ఫోన్ లలో వాడిన ఎక్సీనోస్ 9611 చిప్సెటే అమర్చాలని తెలుస్తోంది. ఈ మొబైల్ ఫోన్లు 6 జిబి రామ్ వరకు పలు వేరియంట్లో లభించనున్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్ ఫోన్స్ ధర 15వేల నుంచి 20వేల మధ్యలో ఉంటుందని టెక్నాలజీ జర్నలిస్టులు చెబుతున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు మొదటిగా కేవలం ఆన్లైన్లోనే విడుదలవుతాయి. ఆ తర్వాత ఆఫ్ లైన్ స్టోర్లలో విడుదల కానున్నాయి అని తెలుస్తోంది. ఏదేమైనా సాంసంగ్ కంపెనీ.. చైనీస్ కంపెనీల స్మార్ట్ ఫోన్లకు పోటీగా సాంసంగ్ గెలాక్సీ ఎం, గెలాక్సీ ఎ, గెలాక్సీ ఎఫ్ సిరీస్ ఫోన్స్ ను తయారు చేసి భారత మార్కెట్లోకి విడుదల చేస్తోంది.